ఉక్రెయిన్ పై రష్యా దురాక్రమణను మొదటి నుంచి అందరికంటే ఎక్కువగా వ్యతిరేకిస్తున్నాయి జీ-7 దేశాలు. అమెరికా, బ్రిటన్, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్ సభ్య దేశాలుగా ఉన్న ఈ కూటమి.. ఆర్థికంగా శక్తిమంతమైన దేశాల కూటమి. దీంతో సహజంగానే రష్యాపై ఆర్థిక ఆంక్షలు పెరుగుతున్నాయి. వీటికి మరికొన్ని దేశాలు కూడా మద్దతు ఇస్తున్నాయి. ఇందులో భాగంగానే ఆదివారం వరిన్ని చర్యలకు పశ్చిమ దేశాలు సంసిద్ధమయ్యాయి. ఆ దేశం నుంచి బంగారం దిగుమతులను నిషేధించేందుకు కదులుతున్నాయి. ఇంతకాలం ఉక్రెయిన్ కుఈ కూటమి.. భారీ ఎత్తున ఆయుధాలు ఇస్తూ వస్తున్నది. ఇప్పటికే యూరప్ దేశాలు రష్యా చమురు, సహజ వాయువును కొనుగోలు చేయకూడదని నిర్ణయించాయి. ఇప్పుడు బంగారాన్ని కూడా దిగుమతి చేసుకోవడంపై పునరాలోచన చేస్తున్నాయి. ప్రస్తుతం జీ-7 గ్రూపునకు జర్మనీ నాయకత్వం వహిస్తోంది.
ఈ గ్రూపు దేశాల సమావేశం ఆదివారం జర్మనీలో ప్రారంభమైంది.
రష్యా బంగారం దిగుమతులపై నిషేధాన్ని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆదివారం సదస్సు సందర్భంగా వెల్లడించారు. దీనివల్ల రష్యా ఆర్థికంగా మరింత ఏకాకిగా మారుతుందని చెప్పారు. ఈ అంశంపై జీ7 దేశాలు మంగళవారం లాంఛనంగా ఒక ప్రకటన చేసే అవకాశం ఉంది. చమురు, సహజవాయువు తర్వాత రష్యా నుంచి ఎక్కువగా ఎగుమతయ్యేది బంగారమే. ఆ దేశం నుంచి వెళ్లే స్వర్ణంలో 90 శాతం జీ7 దేశాలకు చేరుతోంది. అందులోనూ 90 శాతం బ్రిటన్‌కు వెళుతోంది. పసిడి లక్ష్యంగా రష్యాపై చర్యలకు బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ కూడా సమ్మతి తెలిపారు. దీనివల్ల క్రెమ్లిన్ అనుకూల ధనికులపై నేరుగా ప్రభావం పడుతుందని చెప్పారు.
పుతిన్ లా సిక్స్ ప్యాక్ బాడీ చూపిద్దాం
రష్యా అధ్యక్షుడు పుతిన్ ది సిక్స్ ప్యాక్ బాడీ. 70 ఏళ్ల వయసులోనూ ఆ ఫిట్ నెస్ ఏమాత్రం తగ్గలేదు. ఆయన చొక్కా లేకుండా కండలు తిరిగిన దేహంతో ఉన్న ఫొటోలు గతంలో ఎన్నోసార్లు వెలుగులోకి వచ్చాయి. సహజంగానూ జూడో మాస్టర్ అయిన పుతిన్.. గూఢచారిగా పనిచేశారు. దీంతో ఫిట్ నెస్ కు అధిక ప్రాధాన్యం ఇచ్చేవారు. దీనికితోడు ఆయన ఎలుగుబంటి, గుర్రాలపై చొక్కా లేకుండా స్వారీ చేస్తున్న ఫోటోలు గతంలో వెలుగులోకి వచ్చాయి.
దీనిని చూసే.. జీ-7 దేశాల సమావేశంలో వ్యంగ్య వ్యాఖ్యానాలు వినిపించాయి. పుతిన్ ను హేళన చేసేలా మాటలు మాట్లాడారు. బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్, కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో.. పుతిన్ చొక్కా లేకుండా స్వారీ చేయడాన్ని కామెంట్ చేసినట్లు ఓ పత్రిక పేర్కొంది. ‘‘కోట్లు, చొక్కాలి విప్పేసి మనందరం పుతిన్ కంటే కఠినంగా (ఫిట్) గా ఉన్నామని చూపాలి’’ అంటూ జాన్సన్ మాట్లాడారని, ‘‘పుతిన్ లా మనం కూడా గుర్రపు స్వారీ చేయాలి’’ అంటూ ట్రూడో అన్నారని ఈ పత్రిక పేర్కొంది.
అటు జీ7 భేటీ.. ఇటు కీవ్ పై రష్యా దాడులు
జర్మనీలో బవేరియన్ ఆల్ప్స్ ప్రాంతంలోని షోల్స్ ఎల్‌మావ్‌లో మూడు రోజుల పాటు జరిగే జీ7 శిఖరాగ్ర సదస్సు ఆదివారం ప్రారంభమైంది. ఈ కీలక భేటీ వేళ.. ఉక్రెయిన్ రాజధాని కీవ్‌పై రష్యా విరుచుకుపడింది. దాదాపు మూడు వారాల తర్వాత కీవ్‌పై దాడి చేయడం ఇదే తొలిసారి. ఆదివారం తెల్లవారుజామున ఓ నివాస భవనంపై క్షిపణి దాడి జరిపింది. ఒకరు మృతి చెందగా, ఓ చిన్నారి సహా పలువురు గాయపడ్డారు. జీ-7, నాటో సమావేశాలకు ముందు ఉక్రెనియన్లను భయపెట్టడానికే ఈ దాడికి దిగింది. రష్యాను నిలువరించేందుకు మరిన్ని చర్యలు తీసుకోవాలంటూ జీ-7 దేశాలకు ఉక్రెయిన్ పిలుపునిచ్చిన సమయంలో ఇది చోటుచేసుకోవడం గమనార్హం.
మరోవైపు.. ఉత్తర, పశ్చిమ ఉక్రెయిన్‌లలోని మూడు సైనిక కేంద్రాలపై తమ సేనలు దాడులు చేపట్టాయని మాస్కో ప్రకటించింది. వాటిలో ఒకటి పోలాండ్ సరిహద్దుకు సమీపంలో ఉందని వెల్లడించింది. కీవ్‌పై దాడిని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఖండించారు. అనాగరిక చర్య అంటూ రష్యాపై మండిపడ్డారు. ఇదిలా ఉండగా.. ఈ వారంలో జీ-7తోపాటు నాటో శిఖరాగ్ర సమావేశాలు జరగనున్నాయి. రష్యా బంగారం దిగుమతులపై నిషేధం విధించాలన్న నిర్ణయంతో జీ-7 చర్చలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి.
అయితే, ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి దిమిత్రో కులేబా మరిన్ని ఆంక్షల కోసం డిమాండ్ చేశారు. కీవ్ దాడిలో గాయపడిన చిన్నారిని స్ట్రెచర్‌పై తీసుకెళ్తున్న ఫోటోను ట్విటర్‌లో పోస్ట్ చేసిన ఆయన.. ‘రష్యా క్షిపణి ఆమె ఇంటిని ధ్వంసం చేసే వరకు కీవ్‌లోని ఈ ఏడేళ్ల చిన్నారి ప్రశాంతంగా నిద్రపోయింది. ఇలా దేశంలోని అనేక ప్రాంతాల్లో దాడులు జరుగుతున్నాయి. క్రెమ్లిన్‌పై మరిన్ని ఆంక్షలు, ఉక్రెయిన్‌కు మరిన్ని భారీ ఆయుధాలు సమకూర్చేలా.. జీ-7 నేతలు స్పందించాలి. రష్యా కుటిల సామ్రాజ్యవాదాన్ని ఓడించాలి’ అని పిలుపునిచ్చారు.