కరోనాతో విమాన ప్రయాణాలు బంద్ అయిన ఈ నాలుగు నెలల కాలంలో భారత రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తాజాగా రష్యా పర్యటనకు వెళ్లారు. సరిహద్దుల్లో చైనాతో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న ఈ సమయంలో రాజ్ నాథ్ సింగ్ రష్యా పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. రెండో ప్రపంచ యుద్ధంలో జర్మనీపై సోవియట్ యూనియన్ విజయానికి 75 ఏళ్ల అయిన సందర్భంగా సంబరాల్లో రాజ్ నాథ్ పాల్గొంటున్నారు.
రక్షణ మంత్రి రాజ్ నాథ్ పర్యటన భారత సైనిక సామర్థ్యాన్ని పెంచే ప్రయత్నంగా మీడియా వర్గాలు పేర్కొంటున్నాయి. చైనాతో కొనసాగుతున్న వివాదాల నేపథ్యంలో యుద్ధ మేఘాలు కమ్ముకుంటే మన ఆయుధాలను పూర్తిగా బలోపేతం చేయడానికి.. అత్యాధునిక ఆయుధాలు సమకూర్చుకోవడానికి భారత రక్షణ మంత్రి రష్యాకు వెళ్లారని అంతర్జాతీయ మీడియాలో వార్తలు వెలువడ్డాయి.
60మల్టీ యుటిలిటీ హెలీకాప్టర్లు రష్యా వద్ద సిద్ధంగా ఉన్నాయట.. 140 హెలికాప్టర్లను భారతదేశంలో నిర్మించనున్నట్లు రష్యా తెలిపినట్టు సమాచారం. కానీ 2014 నుంచి ఈ కాంట్రాక్టును భారత్ నిధుల కొరత సహా రాజకీయ కారణాలతో అవసరం లేదని వాయిదా వేసింది. ఇప్పుడు చైనాతో ఫైట్ నేపథ్యంలో హడావుడిగా కొనడానికి వచ్చినట్టు రష్యాలోని అధికార వర్గాల ద్వారా తెలుస్తోంది. తాజాగా జరగబోయేది హెలికాప్టర్ల ఒప్పందం మాత్రమే కాదని.. రష్యాతో కలిసి రైఫిల్స్ తయారు చేయడానికి కూడా ఒక ఒప్పందం ఉందని సమాచారం. రష్యా ఈ విషయంలో భారత్ తో చేతులు కలపడానికి సిద్ధంగా ఉన్నా ఇన్నాళ్లు భారతే ఆలస్యం చేసింది. ఇప్పుడు అవసరమైంది.
రష్యా నుంచి కీలకమైన ‘ఎస్400 లాంగ్ రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిస్సైల్ సిస్టమ్ ను భారత ప్రభుత్వం చేయాలని డిసైడ్ అయ్యిందట.. ఇప్పటికే ఈ రక్షణ వ్యవస్థను చైనా కొనుగోలు చేసింది. కానీ అది స్మాల్ రేంజ్. కానీ ఇప్పుడు భారత్ కొనేది లాంగ్ రేంజ్. దీంతో క్షిపణులను కూడా నిలవరించగలిగే సామర్థ్యం ఉంది. రష్యా దీన్ని భారత్ కు త్వరగా డెలివరీ చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలిసింది.
అయితే రష్యా నుంచి ఈ రక్షణ వ్యవస్థ కొంటే భారత్ ను బ్యాన్ చేస్తామని అమెరికా బెదిరించడంతో ఇన్నాళ్లు ఈ కొనుగోలు ఆగిపోయింది. కానీ ఇప్పుడు చైనాతో వార్ నేపథ్యంలో భారత్ అత్యవసరంగా ఎస్400 రక్షణ వ్యవస్థ కోసం రష్యాతో డీల్ కుదుర్చుకుంటోంది.
సోవియట్ యూనియన్, రెండో ప్రపంచ యుద్ధ సమయం నుంచి భారత్ కు అండగా రష్యా ఉంది. చైనా నిరంకుశత్వం, నియంతృత్ద పోకడలు ఉన్న దేశం కాబట్టి ఆ దేశంతో స్నేహంగా లేదు. భారత్ లో సత్సబంధాలను రష్యా ఆది నుంచి కోరుకుటోంది. భారతదేశానికి ఏదైనా దేశంతో యుద్ధం వస్తే రష్యా ప్రతీసారి భారత్ కు సాయం చేసింది. ఇప్పుడు ముందుంటోంది. రష్యా ఎప్పుడూ భారత్ తో స్నేహానికే మొగ్గు చూపుతుంది. చైనాతో భారత్ కు వైరం వస్తే తాము శాంతియుతంగా పరిష్కరిస్తామని రష్యా కూడా భారత్ కోరిక మేరకు ప్రకటించింది.
అయితే రష్యా ఆర్థిక పరిస్థితి ఇప్పుడు బాగాలేదు. దీనికి కూడా చైనా సహాయం కావాలి. ఇలాంటి పరిస్థితిలో భారత్ కు రష్యా ఏకపక్షంగా మద్దతు ఇచ్చే పరిస్థితి ఉండకపోవచ్చని రష్యా నిపుణులు చెబుతున్నారు. కానీ భారత్ కు అవసరమైన ఆయుధాలు మాత్రం పంపిణీ చేయడానికి రష్యా సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది.