అప్పటివరకు మనతోనే ఉండి.. నవ్వుతూ మాట్లాడి.. మళ్లీ కొన్ని గంటల్లో వస్తానని బయలుదేరిన వారు.. ఇక ఎప్పటికి తిరిగి రాలేని లోకాలకు వెళ్లిపోయారన్న అనుభవం మాటల్లో వర్ణించలేనంత గుండెకోతకు గురి చేస్తూ ఉంటుంది. తమిళనాడులో చోటు చేసుకున్న హెలికాఫ్టర్ ప్రమాదంలో మరణించిన సైనిక వీరుల అంతిమ సంస్కారాలు మొదలయ్యాయి. ఈ దారుణ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి గురించి ప్రతి భారతీయుడు బాధకు గురవుతున్నాడు. ఇక.. వారి కుటుంబ సభ్యులకు.. బంధుమిత్రుల శోకం అంతా ఇంతా కాదు.
ఈ రోజు (శుక్రవారం) బ్రిగేడియర్ ఎల్ ఎస్ లిద్దర్ కుటుంబం వేదన చూసిన వారి కంట కన్నీరు ఆగని పరిస్థితి. అంతిమ సంస్కారాల సమయంలో లిద్దర్ సతీమణి.. ఆయన కుమార్తెను చూసిన వారు ఎంతటి గుండె నిబ్బరం కలిగి ఉన్నా.. వారి కంట కన్నీరు కారాల్సిందే. అదే సమయంలో విధి విసిరిన కఠిన సవాలును వారు ఎదుర్కొంటూ.. వారి నోటి నుంచి వచ్చిన మాటల్ని విన్నంతనే ప్రతి ఒక్కరి మనసు విషాదంతో నిండిపోవటమే కాదు.. వారి ధైర్యానికి సలాం చేయక మానదు.
విధి నిర్వహణలో తిరిగి లోకాలకు వెళ్లిపోయిన లిద్దర్ శవపేటికను ఆయన సతీమణి గీతిక అత్మీయంగా ముద్దాడారు. నవ్వుతూ వీడ్కోలు పలికారు. తాము ఆయనకు గొప్పగా వీడ్కోలు పలకాలని.. కన్నీటితో కాకుండా నవ్వుతూ ప్రశాతంగా సాగనంపాలన్న ఆకాంక్షను వ్యక్తం చేశారు. తానొక సైనికుడి భార్యనని.. ఇది పూడ్చలేని నష్టమన్న ఆమె.. వీలైనంత గుండె నిబ్బరంతో వ్యవహరించే ప్రయత్నం చేశారు.
లిద్దర్ కుమార్తె పదిహేడేళ్ల ఈ టీనేజర్ మాట్లాడిన మాటలు అందరి మనసుల్ని తాకుతున్నాయి. ‘నాకు పదిహేడేళ్లు. అంటే.. నాకు.. మా నాన్నకు మధ్య పదిహేడేళ్ల అనుబంధం ఉంది. దేశానికి పూడ్చలేని నష్టం.. ఇదే విధి అంటే. నా తండ్రి నాకు హీరో.. నా బెస్ట్ ఫ్రెండ్.. నా స్ఫూర్తిదాత’ అంటూ తన తండ్రి గురించి వ్యాఖ్యానించింది. తండ్రి వీడ్కోలు సందర్భంగా ఆమె ప్రదర్శించిన గుండె నిబ్బరం స్ఫూర్తినిచ్చేలా మారింది. తండ్రి శవపేటిక వద్దకు వెళ్లిన సందర్భంలో ఆమె కన్నీరు మున్నీరయ్యారు.

శుక్రవారం ఉదయం బ్రార్ స్క్రేర్ వద్ద లిద్దర భౌతిక కాయానికి కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్.. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్.. హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్.. త్రివిధ దళాల అధిపతులు.. రక్షణ శాఖ ఉన్నతాధికారులు అంజలి ఘటించారు. సైనిక లాంఛనాల నడుమ లిద్దర్ కు తుది వీడ్కోలు పలికారు. దీనికి సంబంధించిన చిట్టి వీడియో ఒకటి ఇప్పుడు వైరల్ గా మారింది.
Brig L S Lidder's wife Geetika Lidder