తెలంగాణ టీడీపీ అభ్యర్థులు ఒక్కొక్కరుగా చేజారుతున్నారు. కోరుకున్న చోట టిక్కెట్ ఇవ్వలేదని కొందరు అసంతృప్తితో వైదొలుగుతున్నారు. మరికొందరు పోలింగ్ కు ముందే అస్త్ర సన్యాసం చేసేస్తున్నారు. కాంగ్రెస్ నేతలకు ఈ పరిణామం మింగుడు పడటం లేదు.
కేవలం గెలిచే స్థానాల్లోనే టీడీపీ అభ్యర్థులు పోటీ చేస్తారని ముందు నుంచి టీటీడీపీ నేతలు చెప్పుకుంటూ వస్తున్నారు. తర్జన భర్జన అనంతరం సీట్లు సర్దుబాబు వ్యవహారం ఓ కొలిక్కి వచ్చింది. ఓ 14 సీట్లను టీడీపీ కేటాయిస్తున్నట్లు కాంగ్రెస్ నేతలు ప్రకటించారు. మొదట్లోనే ఓ స్తానం వదిలేయగా - 13 స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు బరిలో నిలిచారు. ఇప్పడు సామా రంగా రెడ్డి పోటీలో నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు.
పొత్తులో భాగంగా టీడీపీకి ఇబ్రహీం పట్నం దక్కింది. ఇక్కడి నుంచి పోటీకి అసంతృప్తిగానే ఓకే అన్నారు. నామినేషన్ కూడా వేశారు. కానీ, ఇప్పుడు పోటీలో ఉండనని టీడీపీ అభ్యర్థి సామా రంగా రెడ్డి చెప్పేస్తున్నారు. మొదటి నుంచి ఆయన ఎల్బీనగర్ స్థానాన్ని ఆశించారు. కానీ, ఆయనకు ఇబ్రహీంపట్నం నుంచి పోటీ చేయాలని టీడీపీ అధిష్ఠానం ఆదేశించింది.
ఇలా పోటీలో నుంచి తప్పుకుంటున్న వారిలో సామా రంగా రెడ్డి రెండో వ్యక్తి. కాంగ్రెస్ లో పార్టీలో ఇబ్రహీం పట్నం సీటుకు మంచి డిమాండ్ ఉంది. ముగ్గురు నలుగురు నేతలు పోటీకి సై అన్నారు. ఈ సీటుపై మల్ రెడ్డి రంగారెడ్డి చాలా ఆశలు పెట్టుకున్నారు. ఆయనకు బదులుగా టీడీపీకి సీటు కేటాయించారు. ఇప్పుడు రంగారావు నై అనడంతో - కాంగ్రెస్ పార్టీ తల పట్టుకుని కూర్చొంది. చేసేది లేక - బీఎస్పీ తరుపున బరిలో దిగిన మల్ రెడ్డి రంగారెడ్డికే కాంగ్రెస్ మద్దతు ఇవ్వనుంది.
నామినేషన్ల ఉపసంహరణకు ముందే టీడీపీ పోటీ చేస్తానన్న 14 స్థానాల్లో రెండు.. హ్యాండ్సప్ అవ్వగా - మిగిలిన స్థానాల సంగతి ఏమిటోననే చర్చ మొదలైంది. గెలిచే స్థానాలివే అంటూ చెప్పిన టీడీపీ నేతలు ఇప్పుడు.. ఒక్కొక్కటిగా జారిపోతున్న అభ్యర్థుల విషయంలో నోరు మెదపడం లేదు.