కేసీయార్ కి జగన్ కి అదే నంబర్...కన్ ఫర్మ్...?

Update: 2022-05-03 07:30 GMT
ఒకటే నంబర్ అటూ ఇటూ చెబుతున్నారు. అది మ్యాజిక్ ఫిగర్ కాబోలు అందుకే పదే పదే వల్లె వేస్తున్నారు. ఇంతకు మించి వస్తే అపుడు చూస్తామని కూడా గర్జిస్తున్నారు. ఇంతకీ ఆ నంబర్ ఏంటి, ఆ కధా కమామీషూ ఏంటూ అంటే విషయం చాలానే ఉంది. ఏపీలో జగన్ మూడేళ్ల పాలన ముగిసింది. ఇకా రెండేళ్ల పాలన మిగిలింది. అంటే ఒక విధంగా ఇంటర్వెల్ దాటి చాలా ముందుకు వైసీపీ సినిమా వచ్చేసింది అన్న మాట. దాంతో ఏపీలో వైసీపీ పని సరి అని విపక్షాలు గట్టిగానే సౌండ్ చేస్తున్నాయి.

తెలుగుదేశం అయితే తమకు వచ్చే ఎన్నికల్లో 160 సీట్లు అంటోంది. ఆ మిగిలిన పదిహేను సీట్లు వైసీపీకి వస్తే గొప్పే అని కూడా సెటైర్లు వేస్తోంది. జగన్ 175 తమకే అని ధీమాగా పార్టీ వారితో ప్రకటించగానే చంద్రబాబు అవతల వైపు నుంచి అందుకున్నారు. మీకు వచ్చేవి 17 కూడా కాదు, 175 ఎలా అంటూ బాబు  వైసీపీ నంబర్ ఏమిటో  చెప్పేశారు. ఆయన అంచనా కూడా 15 సీట్లేనట.

ఇదే మాట జనసేన కూడా అంటూ వస్తోంది. 15 సీట్లు మాత్రమే వచ్చే ఎన్నికల్లో వైసీపీకి వస్తాయి. 2019లో వచ్చిన 151లో 1ని జనాలు మైనస్ చేసి పారేస్తారు అని పవన్ కళ్యాణ్ కూడా ఆ మధ్య  ప్రకటించారు. మొత్తానికి ఎవరేమి చెప్పినా ఏపీలో వైసీపీకి 15 సీట్లు వస్తాయని, రావాలని విపక్షాలు గట్టిగా నిర్ణయించేసుకున్నాయి.

ఇపుడు తెలంగాణా వంతు. అక్కడ కేసీయార్ మీద పంచులు వేయడానికైనా పంతం పట్టడానికైనా తయారుగా ఉన్న నాయకుడు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. ఆయన లేటెస్ట్ గా ఒక మీడియా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కేసీయార్ వచ్చే ఎన్నికల్లో ఓడిపోవడం ఖాయమని తేల్చేశారు. ఆయన పార్టీకి 15 సీట్లు మించి రావని ఢంకా భజాయించారు. అంతే కాదు, కేసీయార్ పార్టీ కూడా తమిళనాడులోని ఎంజీయార్ పార్టీ మాదిరిగా ముక్కచెక్కలు కావడం ఖాయమని కూడా జోస్యం చెప్పేశారు.

తెలంగాణాలో కాంగ్రెస్ గెలుపు కన్ ఫర్మ్. ఈ విషయంలో ఎవరికీ ఎటువంటి డౌట్లు ఉండాల్సిన అవసరం అసలు లేదు అని కూడా క్లారిటీ ఇచ్చేశారు. తమకు పోటీ ఎవరూ కాదని కూడా ఆయన అంటున్నారు. తెలంగాణాలో బీజేపీయే అసలు లేదని, దాన్ని పెద్దగా చేసి త్రిముఖ పోటీని క్రియేట్ చేయాలన్నది కేసీయార్ వ్యూహమని ఆయన అంటున్నారు.

అదసలు జరిగే విషయమే కాదని, జనాలకు ఎవరికి ఓటేయాలో తెలుసు అని కూడా రేవంత్ చెప్పుకున్నారు. మొత్తానికి వచ్చే ఎన్నికల్లో  అటు కేసీయార్ కి ఇటు జగన్ కి 15 సీట్లు వస్తాయని విపక్షాలు లెక్కలేస్తున్నాయి. అది నిజమో కాదో చూడాలంటే వేచి ఉండాల్సిందే.
Tags:    

Similar News