ఇసుక దందాలో ఎమ్మెల్యేలు.. స్థానిక నేతల పాత్ర మీద పెద్ద ఎత్తున ఆరోపణలు రావటం.. వీటిని కట్టడి చేసేందుకు ఎంతలా ప్రయత్నిస్తున్నా ఫలితం లేని పరిస్థితి ఏపీలో నెలకొంది. ఏపీ సర్కారుకు దన్నుగా నిలిచిందని చెప్పే ఒక ప్రముఖ మీడియా సంస్థ సైతం.. ఏపీలోని ఇసుక దందా తీరును తట్టుకోలేకపోయింది. ఈ మీడియా సంస్థకు ప్రజల నుంచి వచ్చిన ఫోన్ కాల్స్ తో వారు తప్పనిసరి పరిస్థితుల్లో అధికార పార్టీ నేతల ఆరాచకాల్ని అక్షరాలుగా మార్చి బాబు మీద సంధిస్తే తప్ప.. ఆయనలో చురుకు పుట్టదని భావించినట్లు చెబుతారు.
ఇందులో భాగంగా.. బాబు హయాంలో ఏపీలోని ఇసుక మాఫియా గురించి భారీ కథనాన్ని వెలువరించటమే కాదు.. అధికారపార్టీ నేతలు జిల్లాల వారీగా ఎవరెంత తినేస్తున్నారన్న విషయాన్ని అచ్చేసింది. పేర్లు బయట పెట్టకుండా.. బాబుకు అర్థమయ్యేలా రాసిన ఈ కథనంతో చంద్రబాబు సైతం షాక్ తిన్నట్లు చెబుతారు. ఇసుక విషయంలో మా వాళ్లు కాస్త ప్రయోజనం పొందుతున్నారని తెలుసు కానీ.. ఇంత దారుణ పరిస్థితి ఉందా? అని ఆయన ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసినట్లు చెబుతారు.
ఏపీలో పెరిగిన ఇసుక మాఫియాను కంట్రోల్ చేయటానికి పలు ప్రయత్నాలు చేసిన చంద్రబాబుకు.. తన కంటే బలమైన వ్యవస్థగా ఇసుక మాఫియా మారిందన్న విషయాన్ని అర్థమైనట్లు ఉంది. నెలసరిగా వచ్చి పడుతున్న ఆర్థిక ప్రయోజనాన్ని వదులుకోవటానికి ఏ నేత సిద్ధంగా లేరన్న విషయాన్ని అర్థం చేసుకున్న బాబు.. అన్నింటికి చెక్ చెప్పేందుకు నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు.
ఇసుక కారణంగా భారీ అవినీతికి ఆస్కారం ఏర్పడిందన్న విమర్శలతో పాటు.. ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో వ్యతిరేకత వ్యక్తమవుతున్న పరిస్థితికి చెక్ చెప్పేందుకు సంచలన నిర్ణయానికి మినహా మరో దారి చంద్రబాబుకు లేకపోయింది. దాని ఫలితమే.. తాజాగా ప్రకటించిన ఉచిత ఇసుక. ప్రభుత్వానికి ఎలాంటి ఫీజులు చెల్లించకుండా.. ఎవరికి వారు ఇసుకను తవ్వుకునే అవకాశం లభిస్తుంది.
ప్రభుత్వమే నేరుగా ఉచితం అన్నాక.. ఇసుక మాఫియా సంగతి ప్రజలే చూసుకునే వీలు ఉంటుంది. గతంలోమాదిరి బంగారంగా అమ్మాల్సిన అవసరం ఉండదు. ఉచితంగా ఇసుక దొరకటంతో నిర్మాణ వ్యయం భారీగా తగ్గిపోయే వీలుంది.
ఇంతకాలం ఆంక్షలతో పగ్గాలు వేసిన ఇసుక మీద ఉన్న నియంత్రణ మొత్తాన్ని ఎత్తేస్తూ ఏపీ సర్కారు తాజాగా నిర్ణయంతో.. ఏపీలో ఉచితంగా ఇసుక తవ్వుకొని తీసుకెళ్లే అవకాశం లభించనుంది. ఇసుక కొరత కారణంగా ప్రభుత్వ నిర్మాణాల్లో విపరీత జాప్యం జరుగుతున్న వేళ.. ఇసుక కావాల్సిన వారు.. కావాల్సినంత తవ్వుకునే అవకాశాన్ని కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు పైకి చెబుతున్నా.. ఇదంతా ఏపీలో పెరిగిపోయిన ఇసుక మాఫియాకు షాక్ ఇచ్చేందుకే బాబు తాజా సంచలన నిర్ణయం తీసుకున్నారని చెబుతున్నారు. తాజాగా ప్రకటించిన నిర్ణయానికి సంబంధించి అధికారిక ఉత్తర్వులు త్వరలో విడుదల కానున్నట్లు తెలుస్తోంది.
అయితే.. ఇసుక ఇష్యూలో ఒక్క రూల్ పెట్టారు. ఏపీలో తవ్విన ఇసుక మొత్తం ఏపీలోనే వాడాలని.. పక్క రాష్ట్రాలకు పంపితే కఠిన చర్యలు తీసుకోవాలన్న విషయాన్ని ఏపీ సీఎం బాబు.. అధికారులకు స్పష్టంగా చేసినట్లు చెబుతున్నారు. ఇసుక మీద సంచలన నిర్ణయాన్నిగతంలోనే తీసుకోవాల్సి ఉంది. కానీ.. ఇంతకాలం మౌనంగా ఉన్న ఆయన తాజాగా తీసుకోవటం మంచిదే అయినా.. ఇలాంటి నిర్ణయం మొదటే తీసుకొని ఉంటే.. ఇప్పుడున్నంత వ్యతిరేకతలో పది శాతం కూడా ప్రభుత్వం మీద ఉండేది కాదు. చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ఎలాంటి ప్రయోజనం ఉండదన్న విషయం చంద్రబాబుకు ఇంకా ఎందుకు అర్థం కావట్లేదు..?