భారత్ కు అదృష్ట దేవత మార్గినా హింగిస్ మరో టైటిల్ తెచ్చి పెట్టింది. ఆమెతో జత కట్టిన సానియా మీర్జా జంట.. తాజాగా జరిగిన గ్వాంగ్జూ ఓపెన్ లోనూ చాంపియన్ గా నిలిచింది. ఈ ఏడాది అంతర్జాతీయ టోర్నీలలో అదరగొడుతున్న హింగిస్.. సోనియా జంట తమ టైటిళ్ల వేటను అప్రతిహతంగా కొనసాగిస్తున్నారు. ఫ్రెంచ్.. వింబుల్డన్.. యూఎస్ ఓపెన్ టైటిళ్లను సొంతం చేసుకొని మాంచి ఊపు మీదున్న ఈ ద్వయం.. తాజాగా మరో టైటిల్ ను సొంతం చేసుకున్నారు.
ఈ ఏడాది వీరిద్దరూ కలిసి ఆరు టైటిళ్లను సొంతం చేసుకున్నారు. చైనాలో జరిగిన ఫైనల్ లో చైనా జోడీపై అలవోకగా విజయం సాధించారు. అద్భుతమైన ఫాంలో ఉన్న ఈ ఇద్దరూ ఫైనల్ పోరును కేవలం 58 నిమిషాల్లో ముగించారంటే.. కోర్టులో వీరిద్దరూ ఎంతగా చెలరేగిపోతున్నారో అర్థం చేసుకోవచ్చు.
ఈ ఏడాది మార్చి నుంచి మార్టినా హింగిస్ తో జత కట్టిన సానియామీర్జా..ఒకటి తర్వాత ఒకటి అన్నట్లుగా టైటిళ్ల మీద టైటిళ్లు సొంతం చేసుకుంటున్నారు. వీరిద్దరూ కలిసి పదమూడు టోర్నీల్లో పాల్గొనగా.. ఆరు విజయాల్ని సొంతం చేసుకున్నారు. తాజా విజయంతో సానియామీర్జా వ్యక్తిగతంగా ఏడో టైటిల్ గెలుచుకున్నట్లైంది. ఈ జంట ఇలానే మరిన్ని టైటిళ్లు దూసుకెళుతూ మరిన్ని విజయాల్ని సొంతం చేసుకోవాలని ఆశిద్దాం.