అగ్రరాజ్యానికి అధ్యక్షునిగా ట్రంప్ ఎన్నికవబోతున్నారనే సంకేతాలు ఒకపక్క వస్తుండగా... ట్రంప్ కు సంబందించిన ఒక ఫోటో ఆన్ లైన్ లో వైరల్ అయ్యింది. ఈ ఫోటోలో రిపబ్లికన్ పార్టీ అభ్యర్ధి ట్రంప్... తన భార్య ఎవరికి ఓటు వేస్తుందోనని చూస్తున్నట్లు ఉంది! డొనాల్డ్ ట్రంప్ కుటుంబం సభ్యులు న్యూయార్క్ లోని మన్ హతాన్ స్కూల్ లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్ లో తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంలో ట్రంప్, ఆయన భార్య మెలానియా పక్కపక్కనే నిలబడి ఓటు వేశారు. ఈ క్రమంలో ట్రంప్ తన భార్య వైపుకు తిరిగి తొంగి చూస్తున్నట్లుగా ఉన్న కొన్ని విజువల్స్ అంతర్జాతీయ మీడియా ప్రసారం చేసింది. దీంతో ఇవి ఇప్పుడు ఆన్ లైన్ లో వైరల్ గా మారాయి. ఇక నెటిజన్లు అయితే సోషల్ మీడియాలో తమదైన జోకులు పేలుస్తూ చెలరేగిపోతున్నారు. ఈ విషయంలో తండ్రికి తగ్గ కొడుకుగా మార్కులు కొట్టేసిన ట్రంప్ కుమారుడు ఎరిక్ ట్రంప్ కూడా తన భార్య ఓటు వేస్తుంటే తొంగి తొంగి చూస్తున్నట్లు మరో ఫోటో ఉంది!
ఈ విషయంలో ఆన్ లైన్ లో హల్ చల్ చేస్తోన్న కొన్ని సరదా కామెంట్లు..
* డామిడ్... హిల్లరీకి ఓటు వేద్దాం అంటే ట్రంప్ నన్నే చూస్తున్నాడు.
* ఈ విషయంలో తండ్రిలాగే తనయుడు.
* నమ్మకం.. నమ్మకం.. నమ్మకం లేకుంటే బ్రతుకేది!
* ట్రంప్.. ఆ పక్క చూపులు చాలా ప్రమాదం.
* తండ్రీకొడుకులిద్దరికీ పార్ట్ నర్స్ పై నమ్మకం లేదా?
* కాపురం విషయంలో నమ్ముతాం... ఓటు విషయంలో కాదు!
* ఎక్కడైనా భార్య కానీ.. పోలింగ్ బూత్ లో కాదు!
* తన నీడను కూడా తాను నమ్మనివాడే సిసలైన రాజకీయనాయకుడు!
* మెలైనా మిచ్చెల్ ని కాపీ చేస్తే ట్రంప్ మెలైనాని కాపీ కొడుతున్నాడు.
* ఆమె ఖచ్చితంగా ఎంసీ ముల్లిన్ కే ఓటు వేస్తుంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/