గ్రాండ్... ఈ పదానికి అర్థం కూడా అంతే గ్రాండ్ గా ఉంటుంది. కానీ - రాజకీయాల్లో గ్రాండ్ అనే పదం అర్థం మార్చేసి పరువు తీసేస్తున్నారు. ఏపీలో సోదిలో కూడా లేని పార్టీలు... సొంత వీధిలో కూడా అందరికీ తెలియని అన్ నోన్ లీడర్స్ కలిసి ఒక ప్రెస్ మీట్ పెట్టి గ్రాండ్ అలయన్స్ అంటుండడంతో జనం నవ్వుకుంటున్నారు.
ఏపీలో ఇప్పుడు జనసేన - లోక్ సత్తా - వామపక్షాలు - ఆమ్ ఆద్మీపార్టీ కలిసి గ్రాండ్ అలయన్స్ అంటున్నాయి. ఈ పార్టీల్లో జనాలకు తెలిసిన మొఖాలు రెండే రెండు. ఒకటి పవన్ కల్యాన్ - రెండు జేపీ. వీరు కూడా వ్యక్తులుగానే పాపులర్. కానీ, పార్టీలుగా చూస్తే లోక్ సత్తా ఇప్పటికే సత్తా కోల్పోయి చీలికలు పీలికలుగా మారిపోయి చాలాకాలమైపోయింది. ఇక పవన్ కూడా హీరోగా ఫాలోయింగ్ ఉన్నప్పటికీ రాజకీయంగా ఇంకా ఫాలోయింగ్ సంపాదించని నేత.
ఇక వామపక్షాల గురించి కొత్తగా మాట్లాడుకునేదేమీ లేదు. సిద్ధాంతం - చరిత్ర మర్చిపోయి ఒక్కో రాష్ట్రంలో ఒక్కో స్టాండ్ తో పొలిటికల్ స్టేజ్ నుంచి జారిపడిపోకుండా ఎవరిదో ఒకరి తోక పట్టుకోవడానికే పాకులాడుతున్న సంగతి చూస్తూనే ఉన్నాం. మరో పార్టీ ఆమ్ ఆద్మీ నేపథ్యం గొప్పదైనా.. ఏపీలో ఆ పార్టీ ఛాయే లేదు.
ఇలాంటి పరిస్థితుల్లో వీరంతా కలిసి గ్రాండ్ అలయన్స్ అనేసరికి వ్యంగ్తోక్తులు వినిపిస్తున్నాయి. నిజానికి జాతీయ స్థాయిలో కానీ - రాష్ట్రాల్లో కానీ గ్రాండ్ అలయన్సులు అంటే ప్రధాన ప్రతిపక్షం - మిగతా విపక్షాలు కలిసి పాలక పార్టికి వ్యతిరేకంగా ఏర్పడిన సందర్భాలే చూశాం. కానీ.. ఇక్కడ ప్రధాన ప్రతిపక్షం లేకుండా పాలక పార్టీని ఎదుర్కోవడానికి ‘గ్రాండ్ అలయన్స్’ అంటున్న పార్టీలు ఎన్నికల తరువాత కూడా బచ్చా పార్టీలుగానే మిగిలిపోతాయా లేదంటే గ్రాండ్ అలయన్స్ అర్థం మారుస్తాయా చూడాలి.