తెలుగుబిడ్డ, మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యనాదెళ్ల నవంబర్ రెండోవారంలో హైదరాబాద్ రానున్నారు. ఇటీవల ఆంగ్లంలో విడుదల చేసిన తన సొంత పుస్తకం ‘హిట్ రిఫ్రెష్’ను తెలుగులో విడుదల చేయడంతో పాటుగా పలు కార్యక్రమాల షెడ్యూల్‌తో సత్య ఈ టూర్ పెట్టుకున్నారు. హిట్ రిఫ్రెష్ పుస్తక ప్రచారంలో భాగంగా ఆయన భారత్‌కు వస్తున్న సందర్భంగా 6, 7 తేదీల్లో న్యూఢిల్లీలోనూ, హైదరాబాద్‌లోనూ నిర్వహించే పుస్తక ప్రచార కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ సందర్భంగా వివిధ రంగాలకు చెందిన ప్రముఖులతో ముచ్చటిస్తారు. ప్రధానంగా ఇండస్ట్రీ ప్రముఖులు, కేంద్ర ప్రభుత్వ అధికారులతోపాటు విద్యార్థులు, స్టార్టప్ కంపెనీలు ఇతర ప్రముఖులను కలుస్తారు.
హిట్ రిఫ్రెష్ పుస్తకంలో తన వ్యక్తిగత జీవితంలో వచ్చిన పరివర్తనతోపాటు తాను పనిచేస్తోన్న కంపెనీలో ప్రస్తుతం జరుగుతున్న అంతర్గత మార్పులు, ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ వంటి అంశాల గురించి సత్య వివరించారు. ఈ పుస్తకాన్ని సెప్టెంబర్ 26న ఆవిష్కరించారు. త్వరలో ఇది హిందీ భాషతోపాటు తెలుగు, తమిళ భాషల్లో కూడా అందుబాటులోకి రానుంది. `హిట్ రీఫ్రెష్` పేరుతో సహ-రచయిత గ్రేగ్ షా, జిల్ ట్రేసియా నికోల్స్‌లతో నాదెళ్ల రాసిన పుస్తకం ఈ నెల 26న అంతర్జాతీయ మార్కెట్లో అందుబాటులోకి వచ్చింది. మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్ ఈ పుస్తకానికి ముందుమాట రాయడం విశేషం.
డిజిటల్ వరల్డ్ ఉట్టిపడేలా టైటిల్‌ను రూపొందించడమే కాకుండా అలాగే ఎఫ్5 కీ కూడా దీంట్లో పొందుపరిచారు. గడిచిన రెండేళ్ల కాలంలో మైక్రోసాఫ్ట్‌లో జరిగిన విప్లవాత్మక మార్పుల తీరును దీంట్లో వ్యక్తం చేసినట్లు బ్లాగ్‌లో నాదెళ్ల పేర్కొన్నారు. టెక్నాలజీ, ఆర్థిక రంగం, ఇప్పటి వరకు జరిగిన వ్యక్తిగత వివరాలను దీంట్లో ప్రముఖంగా ప్రస్తావించారు. ఫిబ్రవరి 2014లో స్టీవ్ బామర్ నుంచి మైక్రోసాఫ్ట్ సీఈవోగా సత్య నాదెళ్ల పదవి బాధ్యతలు స్వీకరించిన తర్వాత జరిగిన పలు కీలక విషయాలను ఈ పుస్తకంలో పొందుపరిచినట్లు సమాచారం. ఈ పుస్తకం చాలా మందికి దిశానిర్దేశం చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. 21 ఏళ్లుగా డిజిటల్ రంగంలో వచ్చిన పెనుమార్పులతోపాటు వ్యక్తిగత విషయాలైన భార్య, కుమారుడిపై కూడా ఈ పుస్తకంలో ప్రస్తావించారు.