రాజకీయ శూన్యత ఉందంటూ గడిచిన కొద్దిరోజులుగా వ్యాఖ్యలు వినిపిస్తున్న ప్రముఖ నటులిద్దరికి చురకలు అంటించారు కట్టప్ప అలియాస్ సత్యరాజ్. జయలలిత.. కరుణ ల మరణం తర్వాత తమిళనాడు రాజకీయాల్లో రాజకీయ శూన్యత చోటు చేసుకుందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇదే విషయాన్ని రజనీ.. కమల్ లాంటి అగ్ర నటులు తమ వ్యాఖ్యల్లో ప్రస్తావిస్తున్నారు.
ఇందులో భాగంగా ఇప్పటికే కమల్ హాసన్ మక్కల్ నీది మయ్యం పార్టీని పెట్టి.. ఇటీవల జరిగిన ఎన్నికల్లో పోటీ చేసి ఎదురుదెబ్బ తిన్నది తెలిసిందే. ఇక.. రజనీకాంత్ మాత్రం తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ముందు పార్టీని ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. ఇలాంటివేళ.. కట్టప్పగా సుపరిచితుడైన సత్యరాజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
రజనీకాంత్.. కమల్ హాసన్ ల కారణంగా ఎలాంటి ప్రయోజనం ఉందని.. రాజకీయాల్లోఎలాంటి మార్పు ఉండదని ఎద్దేవా చేశారు. డీఎంకే లాంటి పాతుకుపోయిన పార్టీలను పెకిలించాలని అనుకోవటం మూర్ఖత్వంగా ఆయన పేర్కొన్నారు.
రాజకీయాలు చేయటానికి తమిళనాడులో చాలా పార్టీలు ఉన్నాయని.. ఈ ఇద్దరు నటులు రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం లేదన్నారు. ఎవరి పని వారు చేస్తే సరిపోతుందని చెప్పిన కట్టప్ప.. తాను ఏం చేశానన్న విషయాన్ని మర్చిపోయినట్లుగా కనిపిస్తోంది. నిజమే.. గురివింద లక్షణాన్ని కట్టప్ప భలేగా చెప్పేశారన్న మాట కొందరి నోట వినిపిస్తోంది. మొత్తానికి ప్రముఖ నటుల్ని ఉద్దేశించి విమర్శలు చేసి వార్తల్లోకి వచ్చేశారు సత్యరాజ్.