స్వలింగ సంపర్కం నేరం కాదు: సుప్రీం తీర్పు

Update: 2018-09-06 10:38 GMT
స్వలింగ సంపర్కంపై సుప్రీం కోర్టు సంచలన తీర్పును వెలువరించింది. గే సెక్స్ నేరం కాదంటూ చారిత్రిక తీర్పునిచ్చింది. స్వలింగ సంపర్కానికి చట్టబద్దత కల్పించింది. భారతీయ శిక్షా స్మృతిలోని సెక్షన్ 377పై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేయడం విశేషం. ఈ సెక్షన్ ను రద్దు చేయడం ద్వారా లెస్బియన్ - గే - బైసెక్స్ వల్ - ట్రాన్స్ జెండర్ హక్కులను కాపాడాలని పలువురు దాఖలు చేసిన పిటీషన్ కు మద్దతు తెలిపింది.. ఈ పిటీషన్ పై సుధీర్ఘంగా విచారించిన సుప్రీం కోర్టు గే సెక్స్ నేరం కాదని తీర్పునివ్వడం విశేషం. స్వలింగ సంపర్కులకు కూడా రాజ్యాంగం ప్రకారం అన్ని సమాన హక్కులు లభిస్తాయని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. అయితే జంతువులతో లైంగిక చర్యను, చిన్నారులతో అసహజ శృంగారాన్ని మాత్రం నేరంగానే పరిగణించాలని కోర్టు స్పష్టం చేసింది.

దేశంలో ఇన్ని రోజులు లెస్బియన్ - గే యాక్టివిటీస్ చేస్తే నిషేధం ఉండేది. ఎవరైనా ఈ పని చేస్తే వారిపై కేసులు నమోదు చేసేలా చట్టాలుండేవి. దీనిపై ఎల్జీబీటీ కమ్యూనిటీవాళ్లు కోర్టుకు ఎక్కారు. ఈ వ్యవహారం చాలా ఏళ్ల నుంచి విచారణలో  ఉంది.ఎట్టకేలకు ఇప్పుడు కోర్టు తీర్పు వచ్చింది.

ఈ తీర్పు ప్రకారం ‘గే’ సెక్స్ నేరం కాదు.. లెస్బియన్లు , ట్రాన్స్ జెండర్లు సెక్స్ ను చేసుకోవచ్చు.ఈ తీర్పుతో ఇప్పటివరకూ స్వలింగ సంపర్కాన్ని ఆమోదించిన దేశాల్లో భారతదేశం కూడా చేరినట్టైంది. బలవంతపు హోమో సెక్స్ వల్ కార్యకలాపాలు నేరాలే.. అయితే వారి వారి ఇష్టపూర్వకంగా మాత్రం ఈ విధమైన సెక్స్ వల్ ను పొందవచ్చని న్యాయస్థానం తీర్పునిచ్చింది. ఈ తీర్పుపై లెస్బియన్, గే కమ్యూనిటీలు సంబరాలు చేసుకుంటున్నాయి.
Tags:    

Similar News