వైసీపీలో ఏదో జరుగుతోంది. ఉమ్మడి విశాఖ జిల్లాలో పట్టు పెంచుకోవడానికి వైసీపీ కొత్త ఎత్తులు వేస్తోంది. దాంతో మరో మారు మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత గంటా శ్రీనివాసరావు చర్చల్లోకి వస్తున్నారు. ఆయన టీడీపీలోనే ఉన్నారు. కానీ ఆయన బిగ్ పొలిటికల్ ట్విస్ట్ ఇస్తారని ప్రచారం అయితే జోరుగా సాగుతోంది. గంటా బ్యాచ్ లో చాలా మంది ఆ మధ్యన వైసీపీలోకి దూకారు. అయితే వారికి అక్కడ ఎలాంటి ప్రాధాన్యత దక్కలేదు. కొంతమంది అసంతృప్తితో ఉన్నారు.
ఈ పరిణామాల నేపధ్యంలో మళ్లీ గో టూ పెవిలియన్ అన్నట్లుగా టీడీపీ వైపు వస్తారని కూడా చర్చ నడచింది. కానీ చిత్రంగా వారికి ఇపుడు వైసీపీలో అగ్ర తాంబూలం అందుతోంది. అలా గంటా బ్యాచ్ లో ఉన్న వారు ఇపుడు వైసీపీలో పదవుల ఆశతో ఉన్నారు. మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబుకు వచ్చే ఎన్నికల్లో టికెట్ కన్ ఫర్మ్ అయింది అంటున్నారు. దాంతో ఆయన అనుచరులు దూకుడు చేస్తున్నారు.
ఇక గంటాకు రెండు దశాబ్దాలుగా కుడి భుజంగా ఉన్న బడా కాంట్రాక్టర్ కాశీ విశ్వనాధం గత ఏడాది జీవీఎంసీ ఎన్నికల వేళ టీడీపీని విడిచి వైసీపీలో చేరారు. ఆయన వల్ల చాలా కార్పోరేటర్లు కూడా గెలిచారు. అర్ధబలం అంగబలం పూర్తిగా కలిగి ఉన్న కాశీ నాటి నుంచి వైసీపీలో తనకు సరైన గుర్తింపు కోసం చూస్తున్నారు. కానీ పిలిచి మాట్లాడిన వారులేదు.
అలాంటిది ఈ మధ్య ఆయన క్యాంప్ ఆఫీస్ లో సీఎం జగన్ తో భేటీ కావడం సంచలనం రేపింది. సాధారణంగా మంత్రులకే జగన్ తో భేటీ దొరకదు. కానీ కాశీతో జగన్ భేటీ వేశారు. ఈ సందర్భంగా కాశీ తన మనసులోని మాటను చెప్పేశారుట. ఆయనకు వచ్చే ఎన్నికల్లో అనకాపల్లి ఎంపీ కానీ, ఎమ్మెల్యే సీటు కానీ కావాలని కోరుకున్నారు. దానికి జగన్ అభయం ఇచ్చి పనిచేసుకోండి అని చెప్పి పంపించారు అంటున్నారు.
అలా విశాఖ వచ్చిన కాశీ ఇపుడు రెట్టించిన ఉత్సాహంతో ఉన్నారని అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో చాలా చోట్ల సిట్టింగులకు సీటు గండం తప్పదని అంటున్న వేళ కాశీ లాంటి కొత్త ముఖాలను ఔత్సాహికులను జగన్ రెడీ చేసి పెడుతున్నారని అంటున్నారు. ఇక రెండున్నరేళ్ళుగా తెర వెనక ఉంటూ రాజకీయాలు చేస్తూ వస్తున్న కాశీ ఇక తెర ముందు పాత్ర పోషించాలనుకుంటున్నారుట.
అంతే కాదు ఈ దెబ్బతో చట్టసభలలో ప్రవేశించాలని కూడా భావిస్తున్నారుట. మొత్తానికి కాశీకి జగన్ అభయం ఇవ్వడంతో వైసీపీలో చేరిన గంటా బ్యాచ్ లో మిగిలిన వారు కూడా సీఎం తో భేటీ కోసం ఎదురుచూస్తున్నారు. ఏది ఏమైనా గంటా బ్యాచ్ కి దక్కుతున్న ప్రాధాన్యత బట్టి చూస్తే ఎన్నికలు దగ్గర పడే వేళకు ఈ మాజీ మంత్రి ఏమైనా ఫేస్ టర్నింగ్ ఇచ్చుకుంటారా అన్న చర్చ కూడా వస్తోంది మరి.