సీనియర్లు రిటైర్ అవ్వాలి.. యువతకు ఛాన్స్ ఇవ్వాలి.. కాంగ్రెస్ యూత్ డిమాండ్?
కాంగ్రెస్ అధిష్టానం దూత చెప్పినా.. ఆఖరుకు సోనియా, రాహుల్ గాంధీలు చెప్పినా వినే పరిస్థితుల్లో లేరు కాంగ్రెస్ సీనియర్లు. రేవంత్ రెడ్డిని పీసీసీ చీఫ్ చేసినప్పటి నుంచి అసమ్మతి రాజేస్తున్న నేతలు గ్రూపులుగా మారి రహస్య మీటింగులు పెడుతూ కాంగ్రెస్ లో అగ్గిరాజేస్తున్నారు. ఇటీవల కాంగ్రెస్ నేత భట్టి ఇంట్లో సమావేశమై రేవంత్ రెడ్డి తీరును తప్పుపట్టారు. పక్కపార్టీ నుంచి వచ్చిన రేవంత్.. పార్టీ పదవుల్లో... నియామకాల్లో తమను విస్మరించాడని ఇటీవల ఒక్కరొక్కరు రాజీనామాల బాటపట్టారు.
టీ కాంగ్రెస్ లో ఏర్పడిన సంక్షోభ నివారణకు అధిష్టానం దూత దిగ్విజయ్ సింగ్ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అధ్యక్షతన ప్రారంభమైన పార్టీ అవగాహన సదస్సుకు సీనియర్ నేతలు హాజరుకాలేదు.
ఈ సమావేశానికి భట్టి, కోదండరెడ్డి మాత్రమే హాజరుకాగా.. ఉత్తమ్, మధుయాష్కీ, వీహెచ్., జగ్గారెడ్డి, రాజనర్సింహ, శ్రీధర్ బాబు గైర్హాజరయ్యారు. దీంతో ఏఐసీసీ చీఫ్ మల్లి ఖార్జున ఖర్గే స్వయంగా రంగంలోకి దిగి సీనియర్లకు ఫోన్ చేసినా ఈ సదస్సుకు డుమ్మా కొట్టారు.
యువకుడు, ఉత్సాహవంతుడు.. చరిష్మా ఉన్న నాయకుడు కావడంతో రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ అధిష్టానం పీసీసీ చీఫ్ పదవి అప్పగించింది. నాడు వైఎస్ఆర్ ను చేసినప్పుడు కూడా ఇలానే వ్యతిరేకించారు. కానీ వైఎస్ఆర్ రాష్ట్రమంతా పాదయాత్ర చేసి సీనియర్ల అసమ్మతిని తట్టుకొని మరీ కాంగ్రెస్ ను గెలిపించాడు. రెండు సార్లు అధికారంలోకి తీసుకొచ్చాడు. ఇప్పుడు రేవంత్ కు అదే అసమ్మతిని సీనియర్లు చేస్తున్నారు. పాదయాత్రను అడ్డుకుంటున్నారు.
నిజానికి అధిష్టానం ఆదేశానుసారం పీసీసీ చీఫ్ గా ప్రకటించిన తర్వాత రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోని సీనియర్ నేతలందరినీ ఇంటికి వెళ్లి కలిశారు. అందరి మద్దతు కోరారు. తనను వ్యతిరేకించిన వీహెచ్, కోమటిరెడ్డిలను కలిశారు. ఇంకా అంత బాగుందని అనుకుంటున్న సమయంలో మళ్లీ నేతలంతా రేవంత్ వ్యవహారశైలి, నాయకత్వంపై విమర్శలు ప్రారంభించారు. జగ్గారెడ్డి మొదట్లో సానుకూలంగా ఉన్నా.. ఇప్పుడు పూర్తి వ్యతిరేకమయ్యారు. భట్టి సహా కాంగ్రెస్ సీనియర్లు అంతా ఇటీవల పార్టీ పదవుల పంపకాల్లో తమకు ప్రాధాన్యత లేదని అసమ్మతి రాజేశారు. లేదు. స్ట్రాటజిస్ట్ ఇస్తున్న సర్వేలు, నివేదికలు, రేవంత్ రెడ్డి చేర్పిస్తున్న చేరికలు అన్నీ సీనియర్లకు పొగబెట్టేలా ఉండడంతో వారంతా అసమ్మతి రాజేస్తున్నారు. కొందరు బీజేపీలోకి వెళ్లిపోతుండగా.. ఇంకొందరు కాంగ్రెస్ లోనే ఉంటూ పార్టీని దెబ్బతీస్తున్నారు.
సీనియర్లు అంతా రేవంత్ వ్యవహారశైలి నచ్చక తిరుగుబాటు చేస్తుండడంతో ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ ఎలా ఏకతాటిపైకి వస్తుంది. పార్టీని ఎలా గాడినపెడుతారన్నది అధిష్టానానికి తల ప్రాణం తోకకు వస్తోంది.
దీంతో సీనియర్లు అంతా రిటైర్ అయిపోవాలని.. యువతకు అవకాశం ఇవ్వాలని.. తాము గెలిచి చూపిస్తామంటూ యూత్ కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఇలా పార్టీలో ఉంటూ పార్టీని దెబ్బతీయడం కరెక్ట్ కాదని అంటున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.