వన్డే క్రికెట్లోనే సంచలనం: 165 బంతుల్లోనే 407 పరుగులు

Update: 2022-11-14 11:22 GMT
భారత గడ్డను బ్యాట్స్‌మెన్‌ల బలమైన కోటగా అభివర్ణిస్తుంటారు. సచిన్ టెండూల్కర్ నుంచి విరాట్ కోహ్లీ , రోహిత్ శర్మ నుంచి సునీల్ గవాస్కర్ ల వరకూ గొప్ప బ్యాట్స్ మెన్ కు భారత్ నెలవు.  ఇప్పుడు వన్డే క్రికెట్‌లో 407 పరుగులు చేసి చరిత్ర సృష్టించిన బ్యాట్స్‌మెన్ ఒకరు పుట్టుకొచ్చారు. ఆ యువ క్రికెటర్ పేరు తన్మయ్ మంజునాథ్. ఈ స్కోరు చేస్తున్న అతడి వయసు కేవలం 16 ఏళ్లు మాత్రమే. ఈ  యువ క్రికెటర్ 48 ఫోర్లు, 24 సిక్సర్లు బాదాడు.

షిమోగా (కర్ణాటక)లోని సాగర్‌కు చెందిన తన్మయ్ 50 ఓవర్ల మ్యాచ్‌లో 407 పరుగులు చేశాడు. ఇందుకోసం అతను 165 బంతులు మాత్రమే ఆడాడు. తన్మయ్.. సాగర్ క్రికెట్ క్లబ్ తరపున ఆడతాడు. షిమోగాలో 50-50 ఓవర్ల ఇంటర్ డిస్ట్రిక్ట్ టోర్నమెంట్ లో ఆడాడు. ఇలాంటి మ్యాచ్‌లో భద్రావతి ఎన్‌టీసీసీ జట్టుపై తన్మయ్ ఈ చారిత్రాత్మక ఇన్నింగ్స్ ఆడాడు.

కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ (కెఎస్‌సిఎ) ఆధ్వర్యంలో సాగర్ క్రికెట్ క్లబ్, భద్రావతి మధ్య జరిగిన ఈ మ్యాచ్‌లో తన్మయ్ మంజునాథ్ చారిత్రాత్మక ఇన్నింగ్స్‌తో ఆ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 583 పరుగులు చేసింది. తన్మయ్ సాగర్‌లోని నాగేంద్ర క్రికెట్ అకాడమీలో కోచ్ నాగేంద్ర పండిట్ వద్ద శిక్షణ ఈ యువ క్రికెటర్ శిక్షణ తీసుకుంటున్నాడు. మంజునాథ్ చారిత్రాత్మక ఇన్నింగ్స్‌ను అందరూ కొనియాడుతున్నారు.

వన్డే క్రికెట్‌లో అత్యధిక స్కోరు భారత కెప్టెన్ రోహిత్ శర్మ పేరిట ఉంది.. శ్రీలంకపై హిట్‌మన్ 173 బంతుల్లో 264 పరుగులు చేశాడు. ఈ క్రమంలో 33 ఫోర్లు, 9 సిక్సర్లు కొట్టి చెలరేగాయి. అంతర్జాతీయ క్రికెట్‌లో రోహిత్ 3 డబుల్ సెంచరీలు సాధించగా, సచిన్ టెండూల్కర్ 2010లో భారతదేశం తరపున మొదటి డబుల్ సెంచరీ సాధించిన ఘనతను సాధించాడు.

అలా చేసిన ప్రపంచంలోనే మొదటి పురుష క్రికెటర్ కూడా. ఆ తర్వాత పలువురు క్రికెటర్లు డబుల్ సెంచరీలు కూడా చేశారు.

ఏకంగా 407 పరుగులు చేసిన మంజునాథ్ పేరు ఇండియన్ క్రికెట్ లో మారుమోగుతోంది. అతడి ఆటరె అందరూ కొనియాడుతున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News