ముస్లింల‌పై ముస్లిం పెద్ద ఫైర్‌!!

Update: 2016-04-15 10:57 GMT
హిందూ దేవాల‌యాలోకి మ‌హిళ‌ల ప్ర‌వేశంపై దేశ‌వ్యాప్తంగా జ‌రుగుతున్న చ‌ర్చ క్ర‌మంలోనే మ‌రో అంశం ప్ర‌స్తావ‌న‌కు వ‌చ్చింది. అదే ముస్లిం సంప్ర‌దాయాల్లో ఎన్నో లోటుపాట్లున్నప్ప‌టికీ హిందూ మ‌తాన్ని విమ‌ర్శించే లౌకిక‌వాదులు ఎందుకు ప‌ట్టించుకోవ‌డం లేద‌నే వాద‌న‌. దీన్ని హిందుత్వ వాదులు బ‌లంగా వినిపించారు. అయితే ఆశ్చ‌ర్య‌క‌రంగా ఇదే త‌ర‌హా స్టేట్‌ మెంట్‌ ను ఇపుడు ముస్లింల‌కు దిశానిర్దేశం చేసే సంస్థ బాధ్యురాలు ప్ర‌శ్నించింది.

మూడు సార్లు తలాక్ అని చెప్ప‌డం ద్వారా విడాకులు తీసుకునే విధానం ఇస్లాం వ్యతిరేకమని అఖిల భారత ముస్లిం మహిళ పర్సనల్ లాబోర్డ్ అధ్యక్షురాలు  షయిషా అంబర్ అన్నారు. ఈ విధానాన్ని నిర్వీర్యం చేయాలని ఆమె పిలుపు నిచ్చారు. ఇది ఒక చెడ్డ సాంప్రదాయం అని పేర్కొన్న ష‌యిషా దానిని రద్దు చేయడానికి తాను అన్ని ప్రయత్నాలు చేస్తానని పేర్కొన్నారు. ఈ విధానం ద్వారా ముస్లిం మహిళలు తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నార‌ని పేర్కొంటూ ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ముస్లిం మ‌హిళ‌ల‌ అభిప్రాయాలను పట్టించుకోవడం లేదని ఆమె సమాజాన్ని నిందించారు. ముస్లిం స‌మాజంలోని కీల‌క‌మైన విధానంపై ప్ర‌ముఖ వ్య‌క్తి ఘాటుగా స్పందించ‌డం ఆ సంప్ర‌దాయంలోని లోపాల‌కు నిద‌ర్శ‌న‌మ‌ని హిందుత్వ‌వాదులు వ్యాఖ్యానిస్తున్నారు.
Tags:    

Similar News