షర్మిల పార్టీలో కలకలం.. పదవులు అమ్ముకుంటున్నారట.. సొంత పార్టీనేత ధ్వజం
తెలంగాణలో రాజన్న రాజ్యం స్థాపిస్తానంటూ.. వైఎస్సార్ తెలంగాణ పార్టీ పెట్టిన వైఎస్ తనయ షర్మిలపై తీవ్ర ఆరోపణలు వస్తున్నా యి. పార్టీలో అంతర్గత కుమ్ములాటలు రోడ్డెక్కాయి. ఆమె సొంత పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు ఒకరు ఆమె తీరును మీడి యా ముందు ఎండగట్టారు. పార్టీ పెట్టి మూడు శుక్రవారాలు కూడా కాకుండానే షర్మిల పార్టీలో పదవులు అమ్మేసుకుంటున్నారని.. ఆయన సంచలన ఆరోపణలు చేశారు. దీంతో ఈ విషయం రాజకీయంగా తెలంగాణలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. షర్మిల పార్టీలో పదవులు అమ్ముకుంటున్నారంటూ దేవరకద్రకి చెందిన నర్సింహా రెడ్డి విరుచుకుపడ్డారు.
పార్టీ పదవులు 5 లక్షల రూపాయలకు అమ్ముకున్నారని.. రాత్రికి రాత్రే పేర్లు మార్చేశారంటూ నర్సింహా రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. తాను షర్మిలను వ్యతిరేకించడం లేదని.. కానీ పార్టీలో ఉన్న కోవర్టులను మాత్రమే వ్యతిరేకిస్తున్నానని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను వైఎస్ కుటుంబాన్ని.. ఎప్పటి నుంచో అంటిపెట్టుకుని ఉన్నానని, పార్టీ కోసం తీవ్రంగా కృషి చేస్తున్నానని.. అన్నారు. అయితే.. తన లాంటి వాళ్లను కాదని.. ముక్కూమొహం తెలియని వాళ్లకి పదవులెలా ఇస్తారని ప్రశ్నిస్తున్నారు. పార్టీలో పదవులు ఎవరు అమ్ముకుంటున్నారో తనకు తెలుసని.. పదవులు అమ్ముకుని పార్టీని కార్పొరేట్ స్థాయికి తీసుకెళ్లారని ఆయన మండిపడ్డారు. తాగుబోతులకు పదవులు అమ్ముకున్నారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
అయితే.. షర్మిల పార్టీలో లుకలుకలు ఇప్పుడు బయట పడినా.. వాస్తవానికి ఈ వివాదం చాలా రోజుల నుంచి ఉందని అంటు న్నారు పరిశీలకులు. షర్మిల పార్టీలో ప్రాధాన్యం దక్కాలంటే.. హంగూ ఆర్భాటం.. ఉండాలని.. లేక పోతే.. పట్టించుకోరనే వాదన ఇటీవల కాలంలో జోరుగా వినిపిస్తోంది. దీంతో చాలా మంది నాయకులు అసలు పార్టీ వైపు కన్నెత్తి కూడా చూడడం లేదు. ``రాజకీయాల్లో ఉన్న ప్రతి ఒక్కరూ ధనవంతులు కాలేరు. ప్రజా బలం ఉన్న వారు కూడా ఉంటారు. కానీ, ఆ పార్టీలో ఇవేవీ కాదు.. డబ్బే ముఖ్యంగా భావిస్తున్నారు`` అని.. హైదరాబాద్‌కే చెందిన వైఎస్ కుటుంబానికి సన్నిహితుడిగా మెలిగిన నాయకుడు ఒకరు రుసరుసలాడారు.
ఈ పరిణామాలు కొనసాగుతున్న తరుణంలోనే ఇప్పుడు నరసింహారెడ్డి రోడ్డున పడడం.. తీవ్ర విమర్శలు చేయడం చూస్తే.. షర్మిల పార్టీ కేవలం పదవులు అమ్ముకునేందుకు.. వైఎస్ పేరుతో వ్యాపారం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారనే విమర్శలు సోషల్ మీడియాలో వ్యక్తమవుతున్నాయి. ఇక, షర్మిల చేస్తున్న నిరసనలు, దీక్షలకు కూడా భారీ ఎత్తున నిధులు ఖర్చు పెట్టాల్సి వస్తోందని.. ద్వితీయ శ్రేణి నేతలు కూడా గుసగుసలాడుతున్నారు. ముఖ్యంగా మీడియా కవరేజ్ కోసం.. షర్మిల తాపత్రయ పడుతున్నారని.. ఈ క్రమంలో తమపై ఒత్తిడి తెస్తున్నారని.. వారు కొన్నాళ్లుగా చెబుతున్న విషయం సోషల్ మీడియాలోనూ వైరల్గా మారింది. ఇక, ఇప్పుడు నరసింహారెడ్డి వ్యాఖ్యలతో అసలు షర్మిల పార్టీ కేవలం.. డబ్బు కోసమే పుట్టిందా? వైఎస్ పేరును మసకబార్చేందుకే వచ్చిందా? అనే సందేహాలు వస్తున్నాయని.. వైఎస్ అభిమానులు, సానుభూతి పరులు అంటుండడం గమనార్హం.