రాజన్న రాజ్యం లేదని, తెలంగాణలో రాజన్న రాజ్యం స్థాపిస్తానని.. ఉరకలు వేస్తున్న వైఎస్ షర్మిలకు.. తెలంగాణలో పాగా వేయడం అంత ఈజీయేనా? ఆమెను ఇక్కడి ప్రజలు విశ్వసిస్తారా? ఆమెకు ఉన్న ఓటు బ్యాంకు ఎంత? అసలు తెలంగాణ ఉద్యమ నేపథ్యం ఏమైనా ఉందా? తెలంగాణ కోసం.. రోడ్డెక్కిన చరిత్ర ఉందా? పోనీ.. తెలంగాణ గుండెచప్పుడు తెలుసా? ఇప్పుడు ఈ ప్రశ్నలు రాజకీయ నేతల నుంచి కాదు.. సామాన్య ప్రజల నుంచి వ్యక్తమవుతున్నాయి. తెలంగాణ ఎన్నికలు.. ఏదో నాలుగు డబ్బులు విసిరేస్తోనో.. సెంటిమెంటు డైలాగులు పేలిస్తేనో.. పడేవి కావనే విషయం తెలిసిందే.
విద్యార్థులు, యువత, ఉద్యోగులు, మహిళలు, కార్మికులు, రైతులు.. ఐటీ ఇలా అనేక రూపాల్లో ఓటు బ్యాం కు విభజన జరిగి ఉన్న తెలంగాణలో ఇన్ని వర్గాలను ఆకట్టుకోవడం అంటే.. ఇప్పుడున్న పరిస్థితిలో షర్మిలకు సాధ్యం కాదనే వాదన బలంగా వినిపిస్తుండడం గమనార్హం. పార్టీ ప్రకటన చేయడానికి వెళ్తున్న తెలంగాణ.. ఉద్యమ నేతలను కలవడం కానీ.. అమరుల స్థూపం వద్ద నివాళులు అర్పించడం కానీ చేయ లేక పోయారు. ఇది కదా.. ఎవరైనా.. తెలంగాణలో పాగా వేయాలంటే.. ఇక్కడి ప్రజలను ఆకట్టుకునేందు కు చేయాల్సిన పని! కానీ... షర్మిల దీనిని లైట్ తీసుకున్నారు. ఇక, రైతులను మాత్రమే పట్టుకుని వేలాడడం వల్ల కూడా షర్మిలకు ప్రయోజనం దక్కే అవకాశం లేదు.
కొందరు టీఆర్ ఎస్ నేతల మాటల్లో చెప్పాలంటే.. కేవలం పెయిడ్ ఆర్టిస్టులతోనే షర్మిల సభకు సిద్ధమయ్యారా? అనే సందేహాలు సైతం సోషల్ మీడియాలో వినిపిస్తుండడం గమనార్హం. అదేసమయంలో కుటుంబ పరంగా చూసుకున్నా.. టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ కుటుంబం మాదిరిగా.. ప్రజల్లోకి వెళ్లి.. రాజకీయాలు చేసే నేతలు .. షర్మిలకు అండగా ఉండే నాయకులు కూడా కనిపించడం లేదు. ఇలా అనేక రూపాల్లో షర్మిల ముందు.. స్పీడు బ్రేకర్లు కనిపిస్తున్నాయని విశ్లేషకులు అంచనావేస్తున్నారు.