ఆమె జయలలిత కూతురు కాదు

Update: 2016-12-12 07:39 GMT
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత అవివాహితురాలు అనే విషయం తెలిసిందే. అయితే.. గత కొన్నేళ్లుగా జయలలితకు కూతురు అంటూ ఓ మహిళ ఫోటో చక్కర్లు కొడుతోంది. సెల్ ఫోన్ విప్లవం పీక్ స్టేజ్ కి వచ్చాక.. ఇలా సర్క్యులేట్ కావడం మరీ విపరీతం అయిపోయింది.

ఇప్పుడు జయలలిత కూతురు వ్యవహారం ఓ కొలిక్కి వచ్చింది. ఈ విషయాన్ని వెల్లడించింది ఎవరో కాదు.. సింగర్ కం డబ్బింగ్ ఆర్టిస్ట్ అయిన చిన్మయి శ్రీపాద. 'ఈ ఫోటోలు ఎటాచ్ చేస్తూ ఓ దిక్కుమాలిన న్యూస్ ను తగిలించారు. వీరు మా కుటుంబానికి తెలిసిన వ్యక్తులు. ఆమె పేరు దివ్యా రామనాథన్ వీరరాఘవన్. ఈమెకు జయలలిత గారికి సంబంధం లేదు. శాస్త్రీయ సంగీతం నుంచి వచ్చిన వీరు.. ప్రముఖ మృదంగ విద్వాంసుడు వి.బాలాజీ కుటుంబానికి చెందినవారు. ప్రస్తుతం వీరు ఆస్ట్రేలియాలో ఉంటున్నారు.' అంటూ క్లారిటీ ఇచ్చింది చిన్మయి.

గూగుల్ లో జయలలిత డాటర్ అని సెర్చ్ చేసినా.. ఈమె ఫోటోలే వచ్చేంతగా సర్క్యులేట్ కావడం.. ఇప్పటి సోషల్ మీడియా పుణ్యమే అని చెప్పాలి. 'వంద సార్లు చెబితే అబద్ధం కూడా నిజమైపోతుంది అన్న సామెతలా ఉంది వ్యవహారం' అంటోంది చిన్మయి. వచ్చిన మెసేజ్ నిజమో కాదో తెలుసుకోకుండానే.. గ్రూపుల్లో షేర్ చేసి ఆనందం పొందే జనాల కారణంగా.. ఇలాంటి అబద్ధాలెన్నో నిజాలు అనుకునేంతగా వైరల్ అయిపోతున్నాయి.

Tags:    

Similar News