చనిపోయిన 3 నెలల తర్వాత ఈమెకు వ్యాక్సిన్.. ఎలా సాధ్యం?

Update: 2021-12-10 09:43 GMT
దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం చేయాలని కేంద్రం పదే పదే రాష్ట్రాలకు సూచిస్తోంది. రాష్ట్రాలు సైతం ఆరోగ్యశాఖ అధికారులపై ఈ మేరకు ఒత్తిడి పెంచుతున్నారు. ఇప్పటివరకూ వ్యాక్సిన్ వేసుకోని వారికి ఫస్ట్ డోసు.. ఫస్ట్ డోసు తీసుకున్న వారికి సెకండ్ డోసు వేయాలని అధికారులకు ప్రభుత్వాలు సూచిస్తున్నాయి.

ప్రతిరోజు ఎంత మంది వ్యాక్సినేషన్ చేస్తున్నారనే దానిపై ఎప్పటికప్పుడు రిపోర్టులు తెప్పించుకుంటున్నాయి. వ్యాక్సినేషన్ తక్కువగా జరుగుతున్న ప్రాంతాలపై స్వయంగా కేంద్రం ఫోకస్ చేస్తోంది. ఆ జిల్లా అధికారులతో స్వయంగా మాట్లాడుతోంది.

ఈ క్రమంలోనే ప్రధాని నరేంద్రమోడీ సైతం పలు జిల్లాల కలెక్టర్లతో వ్యాక్సినేషన్ ప్రక్రియపై మాట్లాడి వారికి తగు సూచనలు చేసిన సందర్భాలున్నాయి. అయితే తాజాగా బీహార్ లోని ఓ జిల్లాలో ఏకంగా మూడు నెలల క్రితం చనిపోయిన ఓ వృద్ధురాలికి వ్యాక్సిన్ సెకండ్ డోసు వేసినట్టు మెసేజ్ రావడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. మరణించిన మహిళ కౌసల్యా దేవికి కోవిడ్ వ్యాక్సిన్ మొదటి డోస్ 26 ఏప్రిల్ 2021న ఛప్రా సదర్ హాస్పిటల్ లో వేశారు. మొదటి డోస్ వ్యాక్సిన్ వేసిన కొన్ని నెలలకే ఆ మహిళ ఓ వ్యాధితో మరణించింది.

అయితే డిసెంబర్ 9,2021న ఆమె మొబైల్ నంబర్ కు రెండో డోసు వ్యాక్సిన్ వేసుకున్నట్టు మెసేజ్ వచ్చింది. ఇది చూసి ఆమె కుటుంబ సభ్యులు షాక్ అయ్యారు. వైద్యఆరోగ్యశాఖ నిర్లక్ష్యంపై మృతిరాలి కుమారుడు అసహనం వ్యక్తం చేశారు.

తల్లి చనిపోయిన మూడు నెలలకే రెండో డోస్ ఇవ్వాలన్న సందేశం అందడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోందని తెలిపారు. మరణించిన మూడు నెలల తర్వాత రెండో డోస్ ఇస్తున్నట్టు సందేశం డిసెంబర్ 9న రావడం వారికి షాక్ ఇచ్చింది. సాఫ్ట్ వేర్ సమస్య వల్లే ఇలా అయ్యిందని అధికారులు చెబుతున్నారు.
Tags:    

Similar News