రాజకీయాలలో పునీతులు ఎవరూలేరు బీజేపీకి శివసేన హెచ్చరిక

Update: 2019-10-29 07:27 GMT
తాజాగా మహారాష్ట్రలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ -శివసేన కూటమి విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికలకి ముందే శివసేన , బీజేపీ ఒక ఒప్పందంతో ఎన్నికల బరిలో నిలిచాయి. ఎన్నికల ముందు అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి పీఠాన్ని చెరో రెండున్నరేళ్లు పంచుకోవాలని ఒప్పందం చేసుకున్నారు. 288 స్థానాలకు జరిగిన ఈ  అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ-శివసేన కూటమి 161 సీట్లు గెలుచుకుంది. ఇందులో బీజేపీ 105 సీట్లు, శివసేన 56 సీట్లు గెలిచింది.

కానీ , ఇప్పుడు బీజేపీ సీఎం పదవి రొటేషన్‌గా పంచుకోవడానికి సిద్ధంగా లేదు. కానీ , శివసేన మాత్రం ఎన్నికలకి ముందు ఒప్పందం ప్రకారం అధికారం చెరి సగం పంచుకోవాల్సిందేనని మరోసారి స్పష్టం చేసింది. రాజకీయాల్లో ఎవరూ సాధుసంతులు కాదు. పునీతులు కాదు. అవసరమైతే కాంగ్రెస్‌, ఎన్సీపీల మద్దతు తీసుకొనేందుకు వెనుకాడం. అయితే మేం కొన్ని విలువల కు కట్టుబడ్డాం. ఎన్నికల ముందు కుదిరిన పొత్తు ను గౌరవిస్తున్నాం. అందుకే ఇంకా నిర్ణయం తీసుకోలేదు అని సంజయ్‌ రౌత్‌ తెలిపాడు. మేము ప్రత్యామ్నాయాలు చూసుకునే స్థితికి తీసుకురావద్దు అంటూ బీజేపీని హెచ్చరించారు.

ఈ సమయంలోనే సీఎం దేవేంద్ర ఫడణవీస్‌ - శివసేన సీనియర్‌ నేత దివాకర్‌ రౌత్‌ సోమవారం గవర్నర్‌ భగత్‌ సింగ్‌ కొషియారీని విడివిగా కలిశారు. బీజేపీ బుధవారం శాసనసభాపక్ష నేతను ఎన్నుకుంటుంది. దీనికి  పార్టీ అధ్యక్షుడు అమిత్‌ షా మహారాష్ట్రకు రానున్నారు. ఈ నేపథ్యంలోనే  శివసేన అధినేత ఉద్ధవ్‌ ఠాక్రేను అమిత్ షా కలిసే అవకాశం ఉందని సమాచారం.
Tags:    

Similar News