ఒకవైపు కలిసే ఉంటాయి. ఒకే కూటమిలో సాగుతూ ఉంటాయి. అధికారాన్ని పంచుకుంటూ ఉంటాయి. అయితే ఒక పార్టీని మరో పార్టీ తీవ్రంగా విమర్శించుకుంటాయి. ఒకరి ఇగోను మరొకరు హర్ట్ చేసుకుంటూ ఉంటాయి. ఇదీ శివసేన-బీజేపీ పార్టీల తీరు.
ఒక పార్టీ పై మరో పార్టీ కొన్ని సందర్భాల్లో తీవ్ర విమర్శలు చేస్తూ ఉంటాయి. ప్రధానమంత్రి మోడీపై కూడా శివసేన ఇది వరకూ తీవ్ర విమర్శలు చేసింది. నోట్ల రద్దు వంటి చర్యలను కూడా తీవ్రంగా తప్పు పట్టింది ఆ పార్టీ.అయితే బీజేపీతోనే కలిసి సాగుతూ ఉంటుంది.ఇటీవలి లోక్ సభ ఎన్నికల్లో కూడా శివసేన-బీజేపీలు కలిసి పోటీ చేశాయి. మంచి ఫలితాలను సాధించాయి
అయినా మహారాష్ట్ర అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికల దగ్గరకు వచ్చేసరికి ఇరు పార్టీలూ మళ్లీ కీచులాడాయి. సీట్ల పంపకం విషయంలో విబేధించుకున్నాయి. అయితే చివరకు మాత్రం ఆ పార్టీలు రాజీకి వచ్చాయి. ఆ పార్టీల మధ్యన సీట్ల పంపకం ఒక కొలిక్కి వచ్చిందని తెలుస్తోంది.
విశేషం ఏమిటంటే.. మెజారిటీ సీట్లను బీజేపీ ఖాతాలోకే ఇచ్చింది శివసేన. బీజేపీ 152 సీట్లకు, శివసేన 124 సీట్లకు ఒప్పందం కుదుర్చుకున్నాయి. మిగిలిన సీట్లను తమ మిత్రపక్షాలకు కేటాయించాయి. బీజేపీతో శివసేనకు పొత్తు కుదరిందని, ఈ ఒప్పందం ఖరారు అయ్యిందని ఉద్ధవ్ ఠాక్రే ప్రకటించారు. తమ పార్టీ తరఫున ఎవరైనా ఈ ఒప్పందం పై తిరుగుబాటు చేస్తే చర్యలు తప్పవని ఆయన హెచ్చరిక కూడా జారీ చేశారు!