'సామ్నా' లో కథనం: ట్రంప్ పర్యటనను స్వాగతించని శివసేన

Update: 2020-02-24 09:16 GMT
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటనను ఒకప్పటి బీజేపీ మిత్రపక్షం వ్యతిరేకించింది. ట్రంప్ పర్యటనతో భారతదేశానికి ఉండే ప్రయోజనం ఏమి లేదని పేర్కొంది. ట్రంప్ పర్యటనపై అసహనం వ్యక్తం చేసింది. ఆయన పర్యటనతో పేద - మధ్య తరగతి ప్రజలకు ఏం మేలు జరుగుతోందని ప్రశ్నించడం విశేషం. ఆ పార్టీనే శివసేన. ప్రస్తుతం మహారాష్ట్రలో కూటమి ప్రభుత్వం ఏర్పడగా ముఖ్యమంత్రిగా ఆ పార్టీ అధినేత ఉద్దవ్ ఠాక్రే ఉన్నారు. ట్రంప్ పర్యటనకు అధికారం ఆ పార్టీ ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే హాజరవుతున్నా ఈ విధంగా తమ పార్టీ ప్రతిక  'సామ్నా'లో వ్యతిరేకించడం విశేషం.

ట్రంప్ పర్యటనను ఎన్డీఏ భాగస్వామ్య పక్షం శివసేన విమర్శలు గుప్పించింది. దేశంలో ట్రంప్ పర్యటనతో ప్రయోజనం ఏమీ ఉండదని పేర్కొంటూ రెండు రోజుల ముందు 'సామ్నా' పత్రికలో వ్యాసం ప్రచురించింది. శివసేన పార్టీ తన అభిప్రాయాలను తన పత్రిక 'సామ్నా' ద్వారా వెల్లడిస్తుంది. ఈ క్రమంలో ట్రంప్ పర్యటనపై ఆ పత్రిక కథనం ప్రచురించింది. పెద్దన్న పర్యటనతో పేద - మధ్య తరగతి ప్రజలకు ఏం మేలు జరుగుతోందని ప్రశ్నించింది. భారతదేశ పర్యటనకు వచ్చిన డొనాల్డ్ ట్రంప్‌కు అభినందనలు అంటూ ఎడిటోరియల్‌ రాసుకొస్తూనే ట్రంప్ పర్యటనను విమర్శించింది.

ట్రంప్ పర్యటనలో భాగంగా భారత్-అమెరికా వాణిజ్య అంశాలపై చర్చకొచ్చే అవకాశం ఉండగా. ఆర్థిక మాంద్యం ఉన్న నేపథ్యంలో అమెరికా నుంచి వాణిజ్యపరమైన మద్దతు - డాలర్‌ తో రూపాయి మారక విలువ పెరిగేందుకు ఇది దోహదపడుతోందని పత్రిక చెప్పగా అయితే 36 గంటల్లో ఏం చేస్తారు..? అని ప్రశ్నించింది. భారతదేశ ఆర్థిక సమస్యలు కేవలం 36 గంటల్లో పరిష్కారం కావు అని సామ్నాలో విమర్శించింది. ట్రంప్ మహారాజుకు తమ తరఫున మాత్రం స్వాగతం పలుకుతున్నామని చెప్పింది. అయితే ట్రంప్ పర్యటన నేపథ్యంలో మురికివాడలను కప్పిపుచ్చే ప్రయత్నం జరిగిందని - ఇదీ దేనికి సంకేతమని సామ్నా పత్రికతో శివసేన ప్రశ్నించింది. ట్రంప్ పర్యటనతో మాత్రం పేదలు - మధ్యతరగతి ప్రజలకు మాత్రం ఎలాంటి ప్రయోజనం లేదని విమర్శించింది.

భారత పర్యటనకొచ్చిన ట్రంప్.. వర్తక - వాణిజ్యం కోసం ప్రాధాన్యం ఇచ్చారా.. అని అడిగారు. ఢిల్లీలోని ప్రభుత్వ పాఠశాలను మెలానియా ట్రంప్ పర్యటిస్తుండగా డొనాల్డ్ ట్రంప్ ఏం చేస్తారు.. మోడీ చేసిన అభివృద్ధి పనులను కళ్లారా తిలకిస్తారా అని వ్యంగంగా ప్రశ్నిస్తూనే కథనం రాసింది. ఈ సందర్భంగా పరోక్షంగా అమెరికాను పలు అంశాల్లో హెచ్చరించింది. అంతర్గత అంశం.. భారతదేశ అంతర్గత అంశాల్లో ఇతరుల జోక్యాన్ని సహించబోమని ఈ సందర్భంగా శివసేన తేల్చిచెప్పింది. పౌరసత్వ సవరణ చట్టం - ఎన్ ఆర్సీపై డొనాల్డ్ ట్రంప్ జోక్యం సరికాదని స్పష్టం చేసింది. భారతదేశంలో మత స్వేచ్చపై ఇతరుల జోక్య సహించబోమని - ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన నేతలే కలుగజేసుకుంటారని ఈ సందర్భంగా శివసేన సామ్నా పత్రిక కథనంలో శివసేన తెలిపింది.



Tags:    

Similar News