గబ్బిలాలు, కుక్కలు, పిల్లులు.. ఇలా ఏది పడితే అది ఎలా తింటారో నాకు అర్థం కావడంలేదు. వాటి రక్తం, మూత్రం తాగి ప్రపంచవ్యాప్తంగా వైరస్ ను వ్యాప్తి చేశారు. మొత్తం ప్రపంచాన్నే ప్రమాదంలోకి నెట్టేశారు. నిజంగా నాకు చాలా కోపంగా ఉంది అంటూ చైనీయు లపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ ఆగ్రహం వ్యక్తం చేసాడు. చైనాలోని వుహాన్ సిటీలో వెలుగులోకి వచ్చిన ఈ కరోనా వైరస్ , ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా దాదాపు 120 దేశాలకు పాకింది. ఇప్పటికే 5000 మందికిపైగా మృత్యువాతపడగా.. దాదాపు 1.30 లక్షల మంది కరోనా వ్యాధితో భాదపడుతున్నారు.
ఇకపోతే , ఈ కరోనా పాజిటివ్ కేసులు పాకిస్థాన్ లో కూడా 28 నమోదయ్యాయి. దీంతో రావల్పిండి ఎక్స్ ప్రెస్ గా పేరుపొందిన షోయబ్ అక్తర్ కరోనా పై స్పందించాడు. ఈ మేరకు తన యూట్యూబ్ ఛానెల్ లో ఓ వీడియో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ప్రపంచం మొత్తం రిస్క్ లో ఉందని.. టూరిజం దారుణంగా ప్రభావితమైందని, ఎకానమీ ఘోరంగా పతనమవుతోందని, మొత్తం ప్రపంచమే లాక్ డౌన్ దిశగా పయనిస్తోందని ఆవేదన వ్యక్తంచేశాడు.
అయన పోస్ట్ చేసిన వీడియో లో మాట్లాడుతూ ... నేను చైనా ప్రజలకు వ్యతిరేకం కాదు. కానీ అక్కడి జంతు చట్టాలకు మాత్రం వ్యతిరేకం. అది మీ సంస్కృతి, సంప్రదాయాలని నేను అర్థం చేసుకోగలను. కానీ వాటివల్ల ఇప్పుడు మీకు ఎలాంటి లబ్ధీ లేదు. పైగా అవి మానవాళిని చంపేస్తున్నాయి. చైనీయులను బాయ్ కాట్ చేయాలని నేను చెప్పడంలేదు. కానీ ఈ విషయం లో చట్టం వంటిది ఏదైనా ఉండాల్సిన అవసరం ఉంది. మీరు ఎక్కడ పడితే అది, ఏది పడితే అది తినకూడదు అని చెప్పాడు. అలాగే, భారత్ లో 130 మిలియన్ మంది ప్రజలు ఉన్నారని, అక్కడకు ఈ వైరస్ వెళ్లకూడదని ఆకాంక్షించాడు. భారత్ లోని తన స్నేహితులతో టచ్ లో ఉన్నానని, వారంతా క్షేమంగా ఉండాలని ప్రార్థిస్తున్నట్టు తెలిపాడు. మొత్తానికి తమ పొరుగున ఉన్న మిత్ర దేశం అయిన చైనా పై అక్తర్ కాస్త ఘాటుగానే స్పందించాడు.