కరోనా వైరస్ కారణంగా ఇండియాలో లాక్‌డౌన్ విధించడంతో టాప్ టెన్నిస్ ప్లేయర్ సానియా మీర్జా గత ఐదు నెలలుగా తన భర్త.. పాకిస్థాన్ సీనియర్ క్రికెటర్ షోయబ్ మాలిక్‌కి దూరంగా ఉంటోంది. మార్చి నెలలో తొలిసారి లాక్‌డౌన్ విధించిన కొద్దిరోజుల ముందే యుఎస్ఏ నుంచి హైదరాబాద్‌కి వచ్చిన సానియా మీర్జా.. కొడుకు ఇజాన్‌తో కలిసి ఇక్కడే ఉంది. మరోవైపు అదే సమయంలో పాకిస్థాన్ సూపర్ లీగ్ పీఎస్‌ఎల్‌లో ఆడుతున్న షోయబ్ మాలిక్ పాకిస్థాన్ లో ఉండిపోయాడు. దీంతో.. ఇజాన్ మళ్లీ తన తండ్రిని ఎప్పుడు చూస్తాడో..? అని ఇదివరకే సానియా లైవ్ లో చెప్పింది. అయితే ఇటీవలే పాకిస్థాన్ క్రికెట్ బోర్డు జులై 24న తన కుటుంబాన్ని కలవడానికి అనుమతి ఇచ్చింది.
'ప్రస్తుతం షోయబ్ మాలిక్ పాకిస్థాన్‌లో చిక్కుకుపోయాడు.. నేను ఇక్కడే హైదరాబాద్ లో ఉండిపోయాను. మా ఇద్దరి మధ్య ఇంత దూరం ఎప్పుడు లేదు. ఎందుకంటే.. మా బాబు ఇజాన్ ఉన్నాడు. వాడు తన తండ్రిని చూస్తాడో ఏమో! అయితే మాలిక్‌కి 65 ఏళ్ల తల్లి ఉంది. కాబట్టి అతను అక్కడే ఉండి ఆమెని చూసుకుంటున్నాడు. ప్రస్తుతానికి మేము పూర్తి ఆరోగ్యంగా ఉన్నాము.. త్వరలోనే కలుస్తాం అని ఆశాభావము వ్యక్తం చేసింది సానియా. ఇప్పుడు సానియా ఆశ నిజం కానుంది. "ప్రస్తుతం ప్రయాణ ఆంక్షలు నెమ్మదిగా సడలిపోతున్నందున తమ కుటుంబాలను కలిసే అవకాశం ఉంటుంది. 5నెలల తర్వాత తన కుటుంబాన్ని కలవాలనే షోయబ్ అభ్యర్థనను గౌరవించి అనుమతి ఇవ్వడం కరెక్ట్" అని పిసిబి చీఫ్ వాసిమ్ ఖాన్ ప్రకటించారు.
పాకిస్తాన్ జట్టు జూన్ 28న మాంచెస్టర్ కు బయలుదేరుతుంది. అక్కడ 14 రోజుల నిర్బంధ కాలం తర్వాత.. డెర్బీషైర్‌కు వెళ్లేముందు ప్రాక్టీస్ చేయడానికి అనుమతి ఉంటుంది. మేం పరిస్థితి అర్థం చేసుకొని ఇంగ్లాండ్, వేల్స్ క్రికెట్ బోర్డులతో మాట్లాడి షోయబ్ దేశంలోకి రావడానికి అనుమతి తీసుకున్నాం" అంటూ ఖాన్ తెలిపారు. అంటే జులైలో షోయబ్ తన ఫ్యామిలీని కలవబోతున్నాడు. ఇదిలా ఉండగా పాకిస్థాన్ టీ20 జట్టులో మాత్రమే ఆడుతున్న షోయబ్ మాలిక్.. ఈ ఏడాది అక్టోబరులో ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న టీ20 ప్రపంచకప్‌లో ఆడి రిటైర్మెంట్ ప్రకటించాలని యోచిస్తున్నట్లు సమాచారం.