అనంతపురం మాజీ ఎంపీ, టీడీపీ సీనియర్ నేత జేసీ దివాకర్ రెడ్డి ఏదీ మాట్లాడినా సంచలనమే. తరచూ సంచలన వ్యాఖ్యలతో ఈయన వార్తల్లో నిలుస్తుంటాడు. తాజాగా తన పార్టీ అధినేత చంద్రబాబుకు షాకిచ్చారు. ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలతో సంచలనాలు సృష్టించే జేసీ దివాకర్ రెడ్డి ఈసారి తమ కులస్థుడైన ఏపీ సీఎం జగన్ మీద ప్రశంసలు కురిపించారు. ఈ పరిణామం చంద్రబాబుకు షాకింగ్ లా మారింది.
తాజాగా అసెంబ్లీలో ఆవరణలో జేసీ దివాకర్ రెడ్డి మాట్లాడుతూ ‘ఏపీ సీఎం వైఎస్ జగన్ దమ్మున్న నాయకుడు అంటూ ప్రశంసించారు. తాము చేయాలనుకున్న పనిని జగన్ ధైర్యంగా చేశాడని.. ఆరోగ్యశ్రీ విషయంలో జగన్ నిర్ణయానికి హాట్సాఫ్ అంటూ జేసీ సంచలన కామెంట్ చేశారు. జగన్ ఎదురైతే ఖచ్చితంగా అభినందిస్తానని స్పష్టం చేశారు. చంద్రబాబు ఈ విషయంలో ఏమనుకున్నా తాను పట్టించుకోనని సంచలన కామెంట్ చేశారు.
జగన్ ఆరునెలల పాలన చాలా బాగుందని జేసీ ప్రశంసించారు. ఆరోగ్యశ్రీ వల్ల ఎంతో మందికి ఉపయోగపడుతుందని ఈ నిర్ణయంతో జగన్ మంచి నాయకుడు అయిపోయాడని కొనియాడారు.
టీడీపీలో సీనియర్ నేతగా ఉన్న జేసీ లోపల అసెంబ్లీలో చంద్రబాబు, జగన్ లు తీవ్ర స్థాయిలో తిట్టుకుంటున్న వేళ ఇలా జగన్ పై ప్రశంసలు కురిపించడం టీడీపీని ఇరుకునపెట్టింది.ఆయన వ్యాఖ్యలు టీడీపీలో కలకలం రేపుతున్నాయి.