నిమ్మ‌గడ్డ‌కు షాక్: రిటైర్మెంట్ త‌ర్వాత కూడా విచార‌ణ త‌ప్ప‌ద‌ట‌!

Update: 2021-03-17 15:18 GMT
ఏపీ ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ నిమ్మ‌గ‌డ్డ ర‌మేష్ కుమార్ ను ప్రివిలేజ్ ఇష్యూ వెంటాడుతోంది. ఆయ‌న ప‌ద‌వీ విరమ‌ణ చేసిన త‌ర్వాత కూడా విచార‌ణ‌కు హాజ‌రు కావాల్సిందేన‌ని క‌మిటీ ఆదేశాలు చేసింది. తీసుకునే ఎలాంటి చ‌ర్య‌ల‌కైనా బాధ్య‌త వ‌హించాల్సిందేన‌ని తేల్చి చెప్పింది.

స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల వేళ‌ మంత్రి పెద్దిరెడ్డిపై నిమ్మ‌గ‌డ్డ హౌస్ అరెస్టు ఆర్డ‌ర్ పాస్ చేశారు. దీనిపై ఫిబ్ర‌వ‌రి 6వ తేదీన మంత్రి పెద్దిరెడ్డి స్పీక‌ర్ కు ఫిర్యాదు చేశారు. ఆ త‌ర్వాత మ‌రుస‌టి రోజు ఫిబ్ర‌వ‌రి 7న కూడా రెండోసారి ఫిర్యాదు చేశారు. దీంతో.. ఆ ఫిర్యాదును స్పీక‌ర్, ప్రివిలేజ్ క‌మిటీకి పంపించారు.

ఈ విష‌య‌మై ఇవాళ (మార్చి 17న‌) విచారించామ‌ని క‌మిటీ చైర్మ‌న్ కాకాణి  గోవ‌ర్ద‌న్ రెడ్డి తెలిపారు. ఈ విష‌య‌మై ఎల‌క్ష‌న్ క‌మిష‌న‌ర్ నిమ్మ‌గ‌డ్డ‌కు నోటీసులు పంపుతామ‌ని వెల్ల‌డించారు. క‌మిటీ విచార‌ణ‌కు అందుబాటులో ఉండాల‌ని స్పీక‌ర్ కార్యాల‌య కార్య‌ద‌ర్శి ద్వారా నోటీసులు పంపిస్తామ‌ని తెలిపారు. మ‌రి, దీనిపై నిమ్మ‌గ‌డ్డ ఎలా స్పందిస్తారు? అనేది ఆస‌క్తిక‌రంగా మారింది. ఈ నెలాఖ‌రుతో నిమ్మ‌గ‌డ్డ ప‌ద‌వీ కాలం పూర్తికానున్న వి‌ష‌యం తెలిసిందే.
Tags:    

Similar News