ఆఫ్ఘానిస్తాన్ లో ప్రస్తుతం తాలిబన్లు వారికి చుక్కలు చూపిస్తున్నారు. తాలిబన్ల చేతుల్లోకి దేశం వెళ్లిపోవడంతో ఆ దేశంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. దేశాధ్యక్షుడే దేశం విడిచి పారిపోయాడంటే అక్కడ పరిస్థితులు ఎంత తీవ్రంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. అఫ్గన్ సైన్యం ఏమాత్రం ప్రతిఘటించకుండా తాలిబన్లకు లొంగిపోయింది. తాలిబన్ల రాక్షస పాలన గురించి తెలిసిన ఆ దేశ ప్రజలు,అక్కడ నుంచి విదేశాలకు వలస వెళ్తున్నారు. అఫ్గన్ ను ఆక్రమించిన తాలిబన్లను, పంజ్ షీర్ ప్రావిన్స్ మాత్రం కలవరపెడుతుంది.
ఈ క్రమంలో ప్రస్తుతం అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. అఫ్గన్ ను ఆక్రమించిన తాలిబన్లు, తమను సవాలు చేస్తున్న పంజ్ షీర్ లోయ ఆక్రమణకు ప్రయత్నించారు. అఫ్గనిస్థాన్ లో పంజ్‌షీర్ తప్పా మొత్తం భూభాగం తాలిబన్ల వశమయ్యింది. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకునేందుకు తాలిబన్లు చేస్తున్న ప్రయత్నాలను అక్కడి మిలీషియా సైన్యం అడ్డుకుంటోంది. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకుంది. పంజ్ షీర్ ను ఆక్రమించుకోడానికి తాలిబన్ లు చేసిన ప్రయత్నాలను తిప్పికొడుతున్నారు. తాజాగా, 300 మంది తాలిబన్లను మట్టుబెట్టినట్టు పంజ్ షీర్ సైన్యం ప్రకటించిందని అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి.
పంజ్ షీర్ లోయకు వెళ్లే మార్గాల్లో ఎక్కడికక్కడ దిగ్బంధించి, గట్టి పహరా నిర్వహిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తాలిబన్లకు లొంగిపోయే ప్రసక్తేలేదని పంజ్ షీర్ ప్రజలు ఉద్ఘాటించారు. మరోవైపు, ఎలాగైనా పంజ్ షీర్ పై పట్టుసాధించాలని తాలిబన్లు కృతనిశ్చయంతో ఉన్నారు. పంజ్ షీర్ వైపు వందలాది వాహానాల్లో భారీ ఆయుధాలతో తాలిబన్లు కదులుతున్నారు. ఉత్తర అఫ్గనిస్థాన్ లోని పంజ్ షీర్ లోయలోకి ప్రవేశించడానికి దాదాపు మూడు దశాబ్దాలుగా తాలిబన్ల చేస్తున్న ప్రయత్నాలనీ విఫలమయ్యాయి. అంతేకాక పలువురు తాలిబన్లను అరెస్ట్ చేసినట్లు అంతర్జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి
అయితే , తాలిబన్లను ఎదుర్కొని, వారిని ఢీకొడుతున్న పంజ్ షీర్ ప్రావిన్స్ ప్రస్తుతం ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోంది. తాలిబన్ల చెర నుంచి అఫ్గన్ ను విముక్తి చేసేది అహ్మద్ షా మసూద్ నాయకత్వంలోని పంజ్ షీర్ సైన్యమే అని అక్కడి ప్రజలు బలంగా విశ్వసిస్తున్నారు. అమెరికాలోని వరల్డ్ ట్రేడ్ సెంటర్, పెంటగాన్ పై 2001 సెప్టెంబరు 11న దాడికి రెండు రోజుల ముందే పంజ్ షీర్ యోధుడు, మిలీషియా నేత అహ్మద్ షా మసూద్‌ను అల్ ఖైదా ఉగ్రవాదులు హత్యచేశారు. ప్రస్తుతం ఆయన తనయుడు అహ్మద్ మసూద్ 9,000 మంది సైన్యాన్ని సిద్ధం చేసి తాలిబన్లతో పోరాడుతున్నట్టు మిలీషియా సైన్యం అధికార ప్రతినిధి అలీ మైసమ్ నజర్ అన్నారు.
మిలీషియా కొత్త విధానాలతో ప్రభుత్వ ఏర్పాటును కోరుకుంటోంది.. కానీ, అవసరమైతే పోరాటానికి కూడా సిద్ధంగా ఉందన్నారు. పలు అఫ్గన్ ప్రావిన్సుల నుంచి ప్రభుత్వ దళాలు పంజ్‌షీర్ లోయకు చేరినట్టు తెలిపారు. గతంలో మాదిరిగా అనుసరించి విధానాలను కొనసాగిస్తే తాలిబన్ల ఎక్కువ కాలం ఉండరు.. మేము అఫ్గనిస్థాన్ ను రక్షించడానికి సిద్ధంగా ఉన్నాం.. రక్తపాతానికి కూడా వెనుకాడబోమని హెచ్చరిస్తున్నాం అని నజర్ తెలిపారు. పంజిషిర్ లోయకు సమీపంలోని మూడు జిల్లాలను అఫ్గన్ ప్రభుత్వ సైన్యం, ఇతర మిలీషియా గ్రూప్ లు సంయుక్తంగా స్వాధీనం చేసుకున్నట్టు ఆ దేశ రక్షణ మంత్రి జనరల్ బిస్మిల్లాహ్ మహ్మద్ ఆదివారం ట్విట్టర్‌లో తెలిపారు