రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు (హత్యానేరం ఆరోపణల తర్వాత పార్టీ నుంచి సస్పెండ్ చేశారనుకోండి) ఆరాచకాలు ఎంతలా ఉంటాయన్న విషయాల్ని కళ్లకు కట్టేలా చూపించింది అతని రిమాండ్ రిపోర్టు.
తన దగ్గన పని చేసిన మాజీ డ్రైవర్ సుబ్రహణ్యాన్ని దారుణంగా చంపేసి.. అతని డెడ్ బాడీని తన కారులో అతనింటికి తీసుకెళ్లి మరీ.. ఇచ్చిన ఉదంతం పెను వివాదంగా మారటం.. పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తిన వైనం తెలిసిందే. చంపేశారన్న ఆరోపణలు పెద్ద ఎత్తున రావటం.. అతడ్ని అరెస్టు చేయాలన్న డిమాండ్ అంతకంతకూ పెరిగిన తర్వాత.. దాదాపు నాలుగు రోజులకు అదుపులోకి తీసుకోవటం.. పోలీసుల విచారణలో తానే చంపి.. రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించిన వైనం తెలిసిందే.
తాజాగా అతన్ని రిమాండ్ కు తరలించే సమయంలో తయారు చేసిన రిమాండ్ రిపోర్టు తాజాగా బయటకు వచ్చింది. అందులో వైపీపీ ఎమ్మెల్సీ అనంతబాబు ఆరాచకాలు ఎంతలా ఉంటాయన్న విషయాన్ని కళ్లకు కట్టినట్లుగా పేర్కొన్నారు.
రిమాండ్ రిపోర్టులో సుబ్రహణ్యం కుటుంబ సభ్యులు కంప్లైంట్ చేస్తూ.. 'వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు.. మా అబ్బాయి డెడ్ బాడీని తీసుకొచ్చి.. మృతదేహాన్ని తీసుకోవాలని.. అందుకు రూ.2లక్షలు ఇస్తానని బెదిరించాడు. డెడ్ బాడీని తీసుకోకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని వార్నింగ్ ఇచ్చాడు' అని పేర్కొనటం చూస్తే.. దారుణంగా చంపేసిన తర్వాత కూడా అనంతబాబు ఎంత దారుణంగా ప్రవర్తించాడో అర్థమవుతుంది.
మే 23న కాకినాడలోని ప్రత్యేక మొబైల్ జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు ముందు డిఎస్పీ తన రిమాండ్ రిపోర్టు ఉంచటం తెలిసిందే. ఇందులో అతను చేసిన నేరం ఎలాంటిదన్న విషయంతో పాటు పలు షాకింగ్ అంశాల్ని పేర్కొన్నారు. ప్రస్తుతం రాజమహేంద్రవరంలోని సెంట్రల్ జైల్లో ఖైదీగా ఉన్న విషయం తెలిసిందే. రిమాండ్ రిపోర్టులో ఏముందంటే..
- సుబ్రహణ్యం తల్లి ఇచ్చిన ఫిర్యాదులో.. 24 ఏళ్ల తన పెద్ద కొడుకు ఆరేళ్లుగా అనంతబాబు వద్ద కారు డ్రైవర్ గా పని చేశాడు. మూడు నెలల క్రితం ఉద్యోగం మానేశాడు. టూ వీలర్ ప్రమాదం జరిగినప్పటి నుంచి ఇంటి దగ్గరే ఉంటున్నాడు. పెళ్లి సమయంలో ఎమ్మెల్సీ వద్ద రూ.50వేలు అప్పుగా తీసుకున్నాడు. తర్వాత రూ.30వేలు అప్పు చెల్లించాడు. ఇంకా రూ.20వేల అప్పు ఇవ్వాల్సి ఉంది.
- అప్పుగా తీసుకున్న రూ.20వేలు తిరిగి ఇవ్వాలంటూ ఒత్తిడి చేయసాగాడు. డబ్బులు ఇవ్వకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని బెదిరించేవాడు. మే 19న రాత్రి ఏడున్నర గంటలకు నా కొడుకు సుబ్రహణ్యాన్ని.. మణికంఠ కలిసి బయటకు వెళ్లారు. ఎనిమిదన్నరకు ఎమ్మెల్సీ ఫోన్ చేసి అతని కదలికలపై ఆరా తీశాడు. రాత్రి పదిన్నర గంటలకు ఎమ్మెల్సీ కారులో సుబ్రహణ్యాన్ని ఎక్కించుకొని తీసుకెళ్లాడు. అర్థరాత్రి 12.50 గంటలకు ఎమ్మెల్సీ ఫోన్ చేసి సుబ్రహ్మణ్యానికి ప్రమాదం జరిగిందని చెప్పాడు. రాత్రి 1.33 గంటల ప్రాంతంలోఫోన్ చేసి కాకినాడ అమ్రత ఆసుపత్రి వద్ద ఉన్నట్లు చెప్పారు. అక్కడ వైద్యులు పరీక్షించి సుబ్రహణ్యం చనిపోయినట్లు చెప్పారు.
- బంధువులతో కలిసి ఆసుపత్రి వద్దకు వెళ్లాం. డెడ్ బాడీని కారులోనే మేం ఉంటున్న అపార్ట మెంట్ కు తీసుకొచ్చారు. రోడ్డు ప్రమాదం జరిగింది.. మీ ఊరుకు తీసుకెళ్లి అంత్యక్రియలు చేసుకోవాలని చెప్పి.. రూ.2లక్షలు ఇవ్వచూపారు. ప్రమాదం గురించి అగిడితే.. తాను చెప్పింది వినాలని.. లేదంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని బెదిరించాడు. దీనిపై వాగ్వాదం జరిగటంతో కారు వదిలేసి.. టూ వీలర్ మీద అక్కడి నుంచి వెళ్లిపోయాడు.
- డెడ్ బాడీ మీద ఉన్న గాయాల్ని చూసిన బంధువులు.. ఇది కచ్ఛితంగా ప్రమాదం కాదని.. గాయపరిచి చంపినట్లుగా అనుమానించారు. పోలీసులకు సమాచారం ఇచ్చారు. కారుడ్రైవర్ గా పని మానుకున్నప్పటి నుంచి పగను పెంచుకున్నాడని.. అతని రహస్యాలన్ని సుబ్రహ్మణ్యంకు తెలియటంతో అతన్ని మట్టుబెట్టి ఉంటారని పేర్కొన్నారు.
- ఈ ఆరోపణల నేపథ్యంలో ఎమ్మెల్సీని కాకినాడ లోని శశికాంత్ నగర్ వీఎస్ లక్ష్మీ డిగ్రీ కాలేజీ రోడ్డులోని మున్సిపల్ కార్పొరేషన్ వెహికల్ యార్డు వద్దకు తీసుకెళ్లి విచారించారు. తన మాజీ డ్రైవర్ ను చంపినట్లుగా ఎమ్మెల్సీ అనంతబాబు ఒప్పుకున్నారు. సుబ్రహ్మణ్యాన్ని చంపినప్పుడు అతన్ని కదలకుండా కట్టిన తాడును పోలీసులు స్వాధీన పర్చుకున్నారు.
- సర్వే కర్రతో సుబ్రహ్మణ్యాన్ని కొట్టినట్లుగా ఒప్పుకన్నారు. డ్రైవర్ మరణానికి కారణమైన తాడు..కర్రను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం రిపోర్టు ప్రకారం అతడి డెడ్ బాడీ మీద 15 గాయాలు ఉన్నట్లుగా వైద్యులు గుర్తించారు. హత్యానేరాన్ని ఒప్పుకున్న తర్వాత ఎమ్మెల్సీ అనంతబాబు నుంచి ఐ13 గోల్డ్ కలర్ యాపిల్ ఫోన్ ను స్వాధీనం చేసుకున్నారు.
- అనంతబాబు రహస్యాలు తెలుసన్న కారణంతోనే మాజీ డ్రైవర్ ను హత్య చేశారన్న ఆరోపణల నేపథ్యంలో కాల్ డేటాతో పాటు.. సెల్ ఫోన్ లో ఉన్న అంశాలు విచారణకు సాయం చేసే అవకాశం ఉంది.
- కొట్టి చంపిన తర్వాత ఆ డెడ్ బాడీని ఇంటికి తీసుకొచ్చిన ఎమ్మెల్సీ అనంతబాబు.. రోడ్డు ప్రమాదంలో మీ అబ్బాయి మరణించాడు.. రూ.2లక్షలు ఇస్తా.. డెడ్ బాడీని మీ ఊరికి తీసుకెళ్లి అంత్యక్రియలు చేయండి. నేను చెప్పినట్లు చేయాలి. లేకుంటే పరిణామాల్ని ఎదుర్కోవాల్సి వస్తుందని మాజీ డ్రైవర్ కుటుంబ సభ్యుల్ని వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు హెచ్చరించారు.