భూ వివాదానికి సంబంధించి పంచాయతీ ఫ్యాక్షన్ ను తలపించేలా కర్నూలు జిల్లాలో అరాచకపు ఘటనలు చోటు చేసుకున్నాయి. షాకింగ్ గా మారిన ఈ ఉదంతాన్ని చూస్తే.. మరీ ఇంత ఆరాచకమా? అనిపించక మానదు. పట్టపగలు అందరూ చూస్తుండగా.. మాట్లాడటానికి వచ్చిన 30 మందిపై విరుచుకుపడిన వైనం.. వారందరిని చంపేయాలన్నట్లుగా వ్యవహరించిన తీరు ఇప్పుడు షాకింగ్ గా మారింది. అంతేకాదు.. తమ ప్రత్యర్థులుగా భావించి వారిపై విరుచుకుపడే క్రమంలో.. వారు అనుసరించిన వైనం మింగుడుపడని రీతిగా మారింది.
యాసిడ్ ను పురుగుల మందు పిచికారీ చేసే వాటితో పిచికారీ చేసి.. వారు గగ్గోలు పెడుతున్న వేళ.. కారం చల్లి మరింత ఉక్కిరిబిక్కిరి చేస్తూ.. కత్తులు.. గొడ్డళ్లతో విరుచుకుపడటం.. దొరికిన వారిపై పెట్రోల్ పోసి తగలెట్టేందుకు సైతం వెనుకాడని ఈ ఉదంతం ఇప్పుడు పెను సంచలనంగా మారింది. ఇంతా చేస్తే.. ఇదంతా భూమికి సంబంధించిన వివాదాన్ని పరిష్కరించేందుకు జరిగిన పంచాయితీ కావటం గమనార్హం. పగలు.. ప్రతీకారాలు తీర్చుకోవటానికి మనుషులు ఎంత దారుణానికి తెగబడతారన్న దానికి నిదర్శనంగా తాజా ఉదంతం నిలుస్తుందని చెప్పాలి.
ఇంతకీ ఈ వివాదం ఏమిటి? ఇంతలా దాడి చేసిందెవరు? బాధితుల పరిస్థితి ఇప్పుడెలా ఉంది? లాంటి వివరాల్లోకి వెళితే.. కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం కౌతాళం మండలం కామవరంలో గురువారం ఉదయం చోటు చేసుకున్న ఈ ఉదంతంలో ఇద్దరు మరణించగా.. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా మారింది.
వివాదం ఇదే..
కామవరానికి చెందిన బోయ మునీంద్రయ్యకు ఏడెకరాల భూమి ఉంది. దాన్ని అనుకొని ఉన్న పోరంబోకు భూమిని సాగు చేసుకుంటున్న మల్లికార్జున.. మునీంద్రయ్య పొలం కొంటానంటూ కొంత నగదు చెల్లించాడు. దీనికి సంబంధించి చాలా ఏళ్ల క్రితం ఒప్పందం చేసుకున్నారు. దీనికి తగ్గట్లే ఒప్పందానికి తగినట్లే పూర్తిగా డబ్బులు చెల్లించారు. అయితే..రిజిస్ట్రేషన్ చేసుకోకుండా మల్లికార్జున కుటుంబం భూమిలోకి సాగు చేయటానికి వెళ్లింది. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ వివాదం కోర్టుకు వెళ్లింది.
కోర్టు నుంచి తనకు అనుకూలంగా తీర్పు వచ్చినా పొలంలోకి రానివ్వటం లేదని మురీంద్రయ్య గ్రామంలోని వైసీపీ నేత మహేంద్రారెడ్డిని ఆశ్రయించారు. విషయం తెలుసుకున్న మల్లికార్జున బీజేపీ నేతలతో ప్రెస్ మీట్ పెట్టించాడు. భూకబ్జాదారు అంటూ వైసీపీ నేతపై సోషల్ మీడియాలో వార్తల క్లిప్పింగులు వచ్చాయి. ఈ భూవివాదంపై ఇరు వర్గాలు పోలీసుల్ని ఆశ్రయించారు.
తనపై జరుగుతున్న ప్రచారంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. మల్లికార్జున్ ను తీసుకురావాలని మహేంద్రారెడ్డి చెప్పటంతో.. వారింటికి సర్పంచి సోదరుడు శివప్పతో పాటు మొత్తం 30 మంది వెళ్లారు.
మాట్లాడేందుకు వెళ్లినట్లుగా చెబుతున్న వారిపై మల్లికార్జున కుటుంబం.. వారి సంబంధీకులు ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. ఊహించని రీతిలో వారిపై దాడికి పాల్పడ్డారు. పక్కా ప్రణాళికతో ఉన్న మ్లలికార్జున వారి సంబంధీకులు తమతో మాట్లాడటానికి వచ్చినట్లుగా చెప్పే 30 మందిపై పురుగుల మందు పిచికారీ చేసే స్ప్రేయర్ లో యాసిడ్ చల్లారు. దీంతో వారంతా భయంతో పరుగులు తీశారు.
ఈ క్రమంలో శివప్ప.. భాస్కర్ లపై కొడవళ్లు.. గొడ్డలి.. కత్తులతో దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన వారిపై పెట్రోల్ పోసి తగలబెట్టారు. కొన ఊపిరితో ఉన్న ఈరన్నను ఆసుపత్రికి తరలించేందుకు ప్రయత్నించగా మార్గమధ్యలో మరణించాడు. ఈ ఘర్షణలో గాయపడిన మరో ఐదుగురు (సత్యప్ప.. బజారప్ప.. అయ్యప్ప.. పెద్ద తిమోతి.. ఇస్మాయిల్) పరిస్థితి విషమంగా ఉందని చెబుతున్నారు. ప్రస్తుతం వీరిని కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఉదంతం గురించి తెలిసినంతనే జిల్లా ఎస్పీ ఆదోని ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి బాధితులతో మాట్లాడారు.
భూతగాదానే దీనంతటికి కారణమని తేల్చారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని రాష్ట్ర వైసీపీ నేత ప్రదీప్ రెడ్డి పరామర్శించారు. మహేంద్రా రెడ్డిపై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై మాట్లాడేందుకు వెళితే ఇంత దారుణంగా దాడి చేశారన్నారు. దాడికి పాల్పడిన వారిలో నలుగురు వ్యక్తులు.. మరో నలుగురు మహిళలు ఉన్నట్లుగా గుర్తించారు. మొత్తం 10 మందిపై కేసు నమోదు చేశారు.
నిందితుల కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. వారంతా ఇళ్లకు తాళాలు వేసి.. పారిపోయారు. నిందితుల్లో ఐదుగురు మూడేళ్ల క్రితం తమ చిన్నాన్న హత్య కేసులో ప్రధాన నిందితులుగా ఉన్నట్లు చెబుతున్నారు. ఏమైనా భూవివాదం.. సోషల్ మీడియాలో జరిగిన ప్రచారంతో వారు వ్యవహరించిన తీరు ఇప్పుడు షాకింగ్ గా మారింది.