కొత్త సంవత్సరం వేళ.. సీఎం మీద చెప్పులు

Update: 2017-01-02 04:25 GMT
ప్రజల ఆందోళనల్ని.. వారి మైండ్ సెట్ లెక్కలు చూసుకోకుండా ముందుకెళితే.. ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయో జార్ఖండ్ ముఖ్యమంత్రిని చూస్తే ఇట్టే అర్థమవుతుంది. పోలీసుల కాల్పుల్లో మరణించిన వారి కోసం ఏర్పాటు చేసిన సంతాప కార్యక్రమానికి హాజరైన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రికి చేదు అనుభవం ఎదురైంది.

ఖార్వా జిల్లాలోని షాహిద్ పార్కులో పోలీసుల కాల్పుల్లో కొందరు మృతి చెందారు. ఈ ఘటన ఆ రాష్ట్రాన్ని ఊపేస్తోంది. ఇదిలా ఉండగా.. పోలీసుల కాల్పుల్లో మరణించిన గిరిజనుల సంతాపంసూచకంగా ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దీనికి ముఖ్యమంత్రి రఘుబార్ పాల్గొన్నారు. ఈ ప్రోగ్రాంకు ముఖ్యమంత్రి హాజరు కావటంపై ప్రజలు తీవ్రఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎంకు వ్యతిరేకంగా నల్ల జెండాలు ఎగురవేయటం గమనార్హం.

ఈ నిరసను పెద్దగా పట్టించుకోనట్లుగా వ్యవహరించిన ముఖ్యమంత్రి రఘుబార్.. పోగ్రాంలో పాల్గొని తన దారిన తాను వెళుతున్న వేళ.. సీఎం వైఖరికి వ్యతిరేకంగా ఆందోళన నిర్వహిస్తున్న వారు చెప్పులు విసిరారు. అదృష్టవశాత్తు అవి సీఎంకు తగలకపోవటంతో.. పెద్ద ఎత్తున అవమానం తృటిలో తప్పిందని చెప్పక తప్పుదు. ఆందోళనకారులు విసిరిన చెప్పులు ముఖ్యమంత్రి మీద పడకుండా తప్పించినందుకు అధికారులు ఊపిరి పీల్చుకోగా.. ఈ ఆందోళనలు ప్రతిపక్షాల కుట్రగా ముఖ్యమంత్రి అభివర్ణించటం గమనార్హం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News