మహేంద్ర సింగ్ ధోనీ... భారత జట్టు మాజీ కెప్టెన్ గా జట్టును అత్యున్నత శిఖరాలకు చేర్చిన విలువైన ఆటగాడు. అంతేనా ఎంతటి క్లిష్ట పరిస్థితులు ఎదురైనా మొన్నవోని సహనంతో వ్యవహరించే ధోనీ... కెప్టెన్ కూల్ గానూ ముద్ర వేసుకున్నాడు. ఈ తరహా వైఖరే అతడికి కోట్లాది మంది ఫ్యాన్స్‌ను సంపాదించి పెట్టింది. ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లు కూడా ధోనీ సలహాల కోసం అతడి వద్దకు ఎలాంటి బేషజాలు లేకుండా వస్తున్నారంటే.... నిజంగానే ధోనీ ఓ అరుదైన ఆటగాడి కిందే లెక్క. ఈ తరహా క్రీడాకారుడు ప్రపంచంలో మరొకరిని చూడలేమంటే అతిశయోక్తి కాదు. నిన్నటిదాకా కెప్టెన్ కూల్ గానే కనిపించిన ధోనీ... ఇప్పుడు తన వైఖరికే పెద్ద ఇబ్బంది తెచ్చుకునేలా వ్యవహరించాడు.
ఈ నెల 11న రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో అంపైర్ల నిర్ణయాన్ని ప్రశ్నిస్తూ.. ధోనీ మైదానంలోకి వెళ్లి అంపైర్లతో వాదనకు దిగిన ధోనీ నిజంగానే కొత్తగా కనిపించాడు. గెలుపైనా, ఓటమైనా ఒకే రీతిన స్పందించే ధోనీ... ఇలా ఎందుకు వ్యవహరించాడంటూ అతడి అభిమానులు కూడా ఆవేదన చెందుతున్నారిప్పుడు. సరే.. ఈ వివాదం సద్దుమణిగింది కదా అనుకుంటున్న సమయంలో కెప్టెన్ గా, ఆటగాడిగా ధోనీకి ఎంతమేర ప్రత్యేకతలున్నాయో, అంపైరింగ్ లోనూ అంతే ప్రత్యేకతలు ఉన్న సైమండ్ టఫెల్ ఇప్పుడు ధోనీ తీరుపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
అంపైరింగ్ లో ఇప్పటిదాకా చిన్నపాటి విమర్శను కూడా ఎదుర్కొని చూడని టఫెల్... ధోనీ తీరుపై అంతెత్తున ఎగిరిపడ్డ చందంగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నిజంగానే ధోనీ వైఖరిని ప్రశ్నించేలా చేస్తున్నాయని చెప్పాలి. అయినా రాజస్థాన్ రాయల్స్ తో మ్యాచ్ సందర్భంగా ధోనీ వ్యవహారాన్ని ఓ సారి పరిశీలిద్దాం. ఆ మ్యాచ్ చివరి ఓవర్ లో చెన్నై విజయానికి 18 పరుగులు అవసరమయ్యాయి. స్టోక్స్ వేసిన ఈ ఓవర్ తొలి బంతిని జడేజా సిక్సర్‌గా మలచగా.. మూడో బంతికి ధోనీ బౌల్డయ్యాడు. దీంతో చెన్నై శిబిరంలో ఒక్కసారిగా ఆందోళన కనిపించింది. దీనికి తోడు నాలుగో బంతిని ఫీల్డ్ అంపైర్ నోబ్‌గా ప్రకటించగా.. లెగ్ అంపైర్ దానిని తోసిపుచ్చాడు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ ధోనీ మైదానంలోకి వచ్చి అంపైర్‌తో వాగ్వాదానికి దిగాడు. ఇక ఆఖరి బంతికి ఫోర్ అవసరం కాగా.. వైడ్ వేయడంతో మరో బంతికి శాంట్నర్ సిక్సర్ బాది చెన్నైకి విజయాన్ని అందించాడు.
అందరినీ షాక్ గురి చేసేలా ఉన్న ధోనీ వైఖరిపై ఐసీసీ కౌన్సిల్ మాజీ అంపైర్ సైమన్ టఫెల్ చాలా ఘాటుగా స్పందించాడు. ఆయన ఏమన్నారంటే... *ఆ సందర్భంలో ధోనీ హద్దు మీరాడు. అంపైర్లు నిర్ణయం తెలిపిన తర్వాత దానికి ఎవరైనా కట్టుబడి ఉండాల్సిందే. ఇందుకు అతడు అతీతుడు కాదు. అసలు మ్యాచ్ జరుగుతున్నప్పుడు డగౌట్‌లో ఉన్న ప్లేయర్ గానీ - కోచ్ గానీ - మేనేజర్స్ గానీ ఫీల్డ్ లోకి వెళ్లకూడదు. ఫీల్డ్ లో ఉన్న అంపైర్లు ధోనీతో చర్చించకుండా బయటకు పంపించి ఉండాల్సింది. వాస్తవానికి అంపైర్లు నిర్ణయం తీసుకునేప్పుడు వారిపై ఎవరి ప్రభావం ఉండకూడదు* అని టఫెల్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలపై కొందరు ఎగిరెగిరి పడుతుంటే... టఫెల్ అన్నదాంట్లో తప్పేముందని మరికొందరు వాదిస్తున్నారు.