ప్రఖ్యాత గాయకుడు ఏసుదాసు కీలక వ్యాఖ్యలు చేశారు. పవిత్ర పుణ్యక్షేత్రంగా భావించే శబరిమలకు మహిళలు వెళ్లొద్దని ఆయన కోరారు. నేను వేడుకొంటున్నా.. మహిళలు శబరిమలకు వెళ్లొద్దంటూ ఆయన పేర్కొన్నారు. చెన్నైలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడిన ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఒకప్పుడు అయ్యప్పస్వామి మాల వేసే భక్తులు వారి ఇంట్లోని మహిళలను చూసేవారు కాదన్నారు. ఇప్పుడు కాలం మారిపోయిందని.. ఎవరైనా అమ్మాయి శబరిమలకు వెళితే దీక్షలో ఉన్న వారు చూస్తారని.. అది వారి మనసులో చెడు భావనకు గురి చేస్తుందన్నారు.
అందుకే తాను శబరిమలకు మహిళల్ని వెళ్లొద్దని వేడుకుంటున్నట్లు చెప్పారు. మహిళలు వెళ్లటానికి దేశంలో చాలానే ఆలయాలు ఉన్నాయని.. వాటన్నింటికి వెళ్లొచ్చు కదా? అని ప్రశ్నించారు. అయ్యప్ప భక్తుల దీక్షను భగ్నం చేయకూడదన్న ఆయన.. శబరిమలకు మహిళల్ని వెళ్లొద్దని వేడుకుంటున్నట్లు చెప్పారు.