అమెరికా లో జైలుకెళ్లిన ఆరుగురు తెలుగు విద్యార్థులు ..ఏం చేశారంటే ?

Update: 2019-11-12 06:21 GMT
అమెరికా .. చదువుకునే ప్రతి ఒక్కరూ అమెరికా వెళ్ళాలి. అక్కడ  మాస్టర్స్ చదవాలి అని కలలు కంటుంటారు. ఇది అందరూ చేయచ్చు ..కానీ , అమెరికా దాక వెళ్ళాలి అంటే చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది. ఇండియా లోని యువత వీసా కోసం వెళ్ళినప్పుడు మాత్రం చదువు అయిపో గానే మళ్ళీ మా దేశం వచ్చేస్తాం అని చెప్తారు. కానీ , నిజానికి అమెరికా నుండి మళ్ళీ ఎవరికీ రావాలని ఉండదు. దీనితో వీసా ప్రాబ్లమ్ అవుతుంది. ఇక వీసా కోసం అక్కడ కొన్ని యూనివర్సిటీస్ లో డబ్బు కట్టి చదువుతున్నట్టు ఫేక్ పేపర్స్ సృష్టించి ..కాలం గడిపేస్తుంటారు. కానీ , చదువు కోవడానికి అమెరికా వెళ్లిన వారు, మాస్టర్స్ చదువు అయి పోయాక, అక్కడ కొంత కాలం ఉద్యోగం చేయవచ్చు. దానికి తగిన వీసా వచ్చినవాళ్లు ఉండాలి. వీసా రాని వాళ్లు వెనక్కు తమ దేశం వెళ్లిపోవాలి. ఇదీ అమెరికా లో రూల్.

కానీ చాలా మంది అమెరికా లో ఉండి పోవడం కోసం ఏదో ఒక చోట చదువుతున్నట్టు తప్పుడు పత్రాలు సృష్టిస్తున్నారు. ఇలాంటి వారిని అటకట్టించడానికి అమెరికా  పోలీసు లే, ఒక నకిలీ యూనివర్సిటీ ని ప్రారంభించారు. ఈ నకిలీ యూనివర్సిటీ పేరు తో విద్యార్థులను గుర్తించే కార్యక్రమం రెండేళ్ల నుంచి రహస్యంగా చేస్తున్నారు అక్కడి పోలీసులు. ది యూనివర్సిటీ ఆఫ్ ఫర్మింగ్టన్‌ పేరుతో ఈ నకిలీ సంస్థను ఏర్పాటు చేశారు. అందులో ఉపాధ్యాయులు, సిబ్బందిగా కనిపించిన అందరూ పోలీసు లే.  అది నిజమైన  యూనివర్సిటీ అని భావించిన సుమారు గా 600 మంది విద్యార్థులు దొరికారు. వీరంతా స్టూడెంట్ వీసా తో ఉద్యోగాలు పొందడానికి ఈ నకిలీ యూనివర్సిటీ లో చేరారని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారం లో కీలకంగా వ్యవహరించిన 8 మంది తెలుగు వారే కావడం విశేషం.

అమెరికా లో సంచలం సృష్టించిన ఈ  ఫార్మింగ్టన్‌ నకిలీ యూనివర్సిటీ కేసులో తెలుగు విద్యార్థులకు తాజాగా  ఫెడరల్‌ న్యాయస్థానం శిక్షలు ఖరారు చేసింది. ఫార్మింగ్టన్ యూనివర్సిటీ లో చేరిన విద్యార్థులను తిరిగి స్వదేశానికి పంపేసిన అధికారులు, ఎనిమిది మంది దళారులను అదుపు లోకి తీసుకొని విచారణ జరిపారు.తాజాగా వీరిలో ఆరుగురి కి శిక్షలు విధించింది ఫెడరల్‌ న్యాయ స్థానం. ఇందులో సామ సంతోష్‌కు 14 నెలల జైలు శిక్ష పడింది. భరత్‌ కాకి రెడ్డి, సురేశ్‌ కందలకు 18 నెలలు, అవినాశ్‌ తక్కళ్ల పల్లికి 15 నెలలు. అశ్వంత్‌ నూనె, ప్రత్తిపాటి నవీన్‌లకు 12 నెలల చెప్పున జైలు శిక్షలు పడ్డాయి. రాంపీస ప్రేమ్‌, కర్ణాటి ఫణిదీప్‌ లకు ఈ నెల 19 న శిక్షలు ఖరారు కానున్నాయి. వీరి శిక్షాకాలం పూర్తయ్యాక వీరిని అమెరికా నుండి స్వదేశాలకి పంపనున్నారు.
Tags:    

Similar News