ఒకప్పుడు ఆమె ఉపాధ్యాయురాలు. పిల్లల్ని కంట్రోల్ చేసే పని ఆమెది. ఆ తరువాత టీడీపీలో చేరి ఎమ్మెల్యేగా ఎదిగారు. అయితే ప్రస్తుతం ఆమె సొంత పార్టీ నేతలకు మాత్రం సమాధానం చెప్పలేకపోతున్నారు. బహిరంగంగానే ఆమె ఈసారి ఎన్నికల్లో పోటీ చేయవద్దని ఆందోళనలు చేపట్టడడంతో ఆమె పరిస్థితి అయెమయంగా మారింది. విశాఖ జిల్లాలో తమకు ఈ అభ్యర్థి వద్దు అంటూ నినాదాలు చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది..?
విశాఖ జిల్లా పాయకరావుపేట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా అనిత గత ఎన్నికల్లో గెలుపొందారు. 2014కు ముందు టీచర్ గా పనిచేసిన ఈమె ఆ తరువాత రాజకీయాల్లోకి వచ్చారు. అసెంబ్లీలోనే కాకుండా బయట కూడా ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకున్నారు. వైసీపీ ఎమ్మెల్యే రోజాతో అనిత పోటీ పడేవారు. ఆమె విమర్శలకు ప్రతివిమర్శలు అనిత మాత్రమే చేసేవారు. వీరి మధ్య చాలాసార్లు డైలాగ్ వార్ నడిచింది.
అయితే ఆమె సొంత నియోజకవర్గంలో మాత్రం మొదటి నుంచి అసమ్మతిని ఎదుర్కొంటున్నారు. 2014కు ముందు చెంగలరావు ఎమ్మెల్యేగా పనిచేశారు. దీంతో ఆయన అనుచరులకు అనితకు మధ్య వర్గ పోరు మొదలైంది. అప్పటి వరకు పార్టీకోసం పనిచేసిన వారిని కాకుండా కొత్తవారికి ప్రాధాన్యత ఇస్తున్నారని టీడీపీ తమ్ముళ్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఈ వ్యవహారం అంతర్గతంగానే నడిచింది. ప్రస్తుతం ఎన్నికల హడావుడి మొదలవడంతో అనితకు వ్యతిరేకంగా రోడ్డుపైకి వచ్చి ఆందోళన చేస్తున్నారు టీడీపీ కార్యకర్తలు. పాయకరావుపేటలో ర్యాలీలు తీసి ఆమెకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు.
గ్రూపు రాజకీయాలకు పాల్పడడమే కాకుండా సొంత పార్టీ నేతలపైనే కేసులు పెట్టించారని తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ఆమె పాయకరావుపేటలో పర్యటించినప్పుడు ఆమెను తెలుగు తమ్ముళ్లు అడ్డుకున్నారు. అంతేకాకుండా ఆమెకు టికెట్ ఇస్తే ఓడిస్తామని హెచ్చరించారు. ఈ విషయం జిల్లా పార్టీ నేతల వద్దకు చేరడంతో వారు సర్దిచెప్పారు. దీంతో పార్టీ అధిష్టానం వద్దకు చేరినా తమ్ముళ్లు శాంతించలేదు. వారు అమరావతి సమావేశానికి వచ్చినప్పుడు తమ కార్లకు అనిత వద్దు.. టీడీపీ ముద్దు.. అంటూ స్టిక్కర్లతో రావడం చర్చనీయాంశంగా మారింది.
అనితకు వ్యతిరేకంగా చెంగలరావు కూతురు విజయలక్ష్మి పోటీలో ఉన్నారని తెలుస్తోంది. ప్రస్తుతం ఆమె టీడీపీలో యాక్టివ్ గా పనిచేస్తోంది. ఈ నిరసనల వెనుక ఆమె ఉన్నారని అనిత వర్గం ఆరోపిస్తోంది. ఈ పరిస్థితుల్లో అనిత భవిష్యత్తు నిర్ణయమేంటోనని చర్చ జోరుగా సాగుతోంది.