నేటి సూర్యగ్రహణంతో కరోనా ఖతం?

Update: 2020-06-21 06:00 GMT
ఎవరి నమ్మకాలు వారివి. శాస్త్రాలు, జ్యోతిష్యాలను మనవాళ్లు అందరూ నమ్ముతారు. ఏదైనా శుభకార్యం అయితే మూహూర్తం చూసుకొనే పెట్టుకుంటారు. ఇప్పుడు జ్యోతిష్యులు చెప్పేది కూడా అందరూ విశ్వసిస్తున్నారు. ప్రముఖ జ్యోతిష్యులంతా  ఈ సూర్యగ్రహణంతో కరోనా ఖతమవుతుందని.. ఇక నుంచి తగ్గిపోతుందని ఘంఠాపథంగా చెబుతున్నారు. దానికి కారణాన్ని వారు వెల్లడిస్తున్నారు.

జ్యోతిషశాస్త్రం ప్రకారం.. కరోనా వైరస్ గత ఏడాది డిసెంబర్ లో ఏర్పడిన సూర్యగ్రహణంతోనే  ప్రారంభమైంది. ఈ ఏడాది నేటి సూర్యగ్రహణంతో  కరోనా ప్రభావం ముగుస్తుందని జ్యోతిష్యులు చెబుతున్నారు.ఈ సమయంలో సూర్యుడు మరింత ప్రకాశవంతంగా వెలుగుతాడని.. సూర్యరశ్మి ధాటికి కరోనా వైరస్ మటుమాయం అవుతుందని ప్రచారం జరుగుతోంది. దీన్ని చెన్నైకి చెందిన న్యూక్లియర్ అండ్ ఎర్త్ సైంటిస్ట్ డాక్టర్ సుందర్ కృష్ణ కూడా ఇదే చెప్తున్నారు. సూర్యగ్రహణంతో కరోనా తగ్గుతుందని చెప్పారు.

ఈ సారి సూర్యగ్రహణం నాడు చంద్రుడి మీద 99శాతం ఆవరిస్తుందట.. ఇలాంటి గ్రహణం 18 ఏళ్లకు ఒకసారి వస్తుందని చెబుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో పాక్షిక సూర్యగ్రహణమే కనిపిస్తుందట.. ఉదయం 10.31 గంటల నుంచి మధ్యాహ్నం 2.30 గంటలకు ముగుస్తుందని తెలుపుతున్నారు.

అయితే అమెరికన్ శాస్త్రవేత్తలు మాత్రం సూర్యగ్రహణం వల్ల కరోనా నశించదని చెబుతున్నారు. భౌతిక దూరం పాటించడం.. చేతులు శుభ్రంగా కడుక్కోవడం వల్ల మాస్క్ లు ధరించడం వల్ల కరోనా మనల్ని కాపాడుకోగలమని అంటున్నారు.
Tags:    

Similar News