కేసీఆర్ నియామకం: తెలంగాణ కొత్త సీఎస్ ఈయనే..

Update: 2019-12-31 12:39 GMT
తెలంగాణ ప్రస్తుత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి   సీఎస్ ఎస్ కే జోషి ఈవాళ రిటైర్ అయ్యారు. ఆయన వారసుడిగా  ఎవరిని నియమిస్తారే ఉత్కంఠకు తెరపడింది. తెలంగాణలో ప్రధానంగా ఈ ప్రభుత్వ ప్రధానకార్యదర్శి పదవికి 14 మంది వరకూ ప్రత్యేక చీఫ్ సెక్రెటరీ స్థాయి అధికారులు పోటీపడ్డారు. అయితే కేసీఆర్ మదిలో మాత్రం అజయ్ మిశ్రా లేదా సోమేష్ కుమార్ లను మాత్రమే ఎంపిక చేస్తారని ప్రభుత్వంలో చర్చ జరిగింది.

ఎట్టకేలకు తెలంగాణ సీఎం కేసీఆర్ తెలంగాణ సీఎస్ ను నియమించారు. 1989 బ్యాచ్ ఐఏఎస్ అయిన సోమేష్ కుమార్ వైపు మొగ్గు చూపి ఆయనను తెలంగాణ సీఎస్ గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
 
తెలంగాణ కొత్త ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సోమేష్ కుమార్ ను నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది.

 ఇక పదవీ విరమణ పొందిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్ కే జోషిని కేసీఆర్ విడిచిపెట్టలేదు. ఆయనకు ప్రభుత్వం మరో అద్భుతమైన అవకాశం కల్పించింది. ఎస్ కే జోషిని తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖ సలహాదారుడిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

 సోమేష్ కుమార్ కు  2023 డిసెంబర్ 31 వరకూ సోమేష్ కుమార్ తెలంగాణ సీఎస్ గా కొనసాగనున్నారు. మరో మూడేళ్ల వరకూ పదవీ కాలం ఉంటారు. సోమేష్ కుమార్ బీహార్ రాష్ట్రానికి చెందిన వారు..


Tags:    

Similar News