త‌మ్ముడు జ‌నం కోసం..అన్న ఎవ‌రి కోసం..చిరంజీపై విమ‌ర్శ‌లు

Update: 2019-12-22 11:35 GMT
ఏపీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్‌ రెడ్డి రాష్ట్రానికి మూడు రాజ‌ధానులు ఉంటాయ‌న్న ప్ర‌క‌ట‌న చేసిన‌ప్ప‌టి నుంచి ఏపీలో రాజ‌కీయం హీటెక్కుతోంది. అధికార టీడీపీ - విప‌క్ష వైసీపీ నేత‌ల మ‌ధ్య తీవ్ర‌మైన మాట‌ల యుద్ధం న‌డుస్తోంది. మ‌రోవైపు రాజ‌ధాని అమ‌రావ‌తి ప్రాంతంలో రైతులు - సామాన్య ప్ర‌జ‌లు సైతం రోడ్లెక్కి నిర‌స‌న‌లు వ్య‌క్తం చేస్తున్నారు. రాజ‌ధాని ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. ఇక మిగిలిన రాజ‌కీయ పక్షాల నేత‌లు కూడా ఎవ‌రికి తోచిన‌ట్టుగా వాళ్లు స్పందిస్తున్నారు.

మూడు రాజ‌ధానుల‌పై బీజేపీలోనే రెండు - మూడు ర‌కాల గొంతులు వినిపిస్తున్నాయి. ఇక టీడీపీలోనూ అదే ప‌రిస్థితి నెల‌కొంది. బాబుపై అసంతృప్తితో ఉన్న నేత‌లంతా జ‌గ‌న్‌కు జై కొడుతున్నారు. ఇక ఇప్పుడు మెగా సోద‌రులు అయిన జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌ క‌ళ్యాణ్‌ - చిరంజీవి చెరోర‌కంగా ఈ విష‌యంపై స్పందించ‌డం కూడా సంచ‌ల‌నంగా మారింది. ఈ క్ర‌మంలోనే ఇటీవ‌ల రాజ‌కీయంగా పెద్ద‌గా స్పందించ‌ని చిరంజీవి శ‌నివారం మూడు రాజ‌ధానుల ప్ర‌క‌ట‌న‌ను స్వాగ‌తిస్తూ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు.

జ‌గ‌న్‌కు సంపూర్ణ మ‌ద్ద‌తు ప్ర‌క‌టించారు. దీంతో మూడు రాజ‌ధానుల కాన్సెఫ్ట్ వ్య‌తిరేకించే వారంతా చిరంజీవిని టార్గెట్‌గా చేసుకుని తీవ్ర విమ‌ర్శ‌లు చేస్తున్నారు. టీడీపీ శ్రేణుల‌తో పాటు ఆ పార్టీ నేత‌లంతా అటు మీడియాలోనూ, ఇటు సోష‌ల్ మీడియాలోను చిరంజీవిని గ‌ట్టిగా టార్గెట్‌గా చేసుకుని కౌంట‌ర్లు ఇస్తున్నారు. మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్‌ రెడ్డి చిరుపై తీవ్రంగా విరుచుకు ప‌డ్డారు. తెలంగాణ‌లో ఉంటూ సినిమా వ్యాపారాలు చేసుకునే పెద్ద‌న్న‌కు ప్ర‌జ‌ల క‌ష్టాలు ఎలా ?  తెలుస్తాయ‌ని మండిప‌డ్డారు.

ప‌వ‌న్ క‌ళ్యాణ్ పేరు ప‌రోక్షంగా ప్ర‌స్తావిస్తూ.. త‌మ్ముడు ప్ర‌జ‌ల కోసం పోరాడుతుంటే ప్రోత్సాహించాల్సింది పోయి... అన్న మ‌రో రాగం ఆల‌పిస్తున్నాడ‌ని సోమిరెడ్డి విమ‌ర్శించారు. త‌న పార్టీని మ‌రో పార్టీలో విలీనం చేసి... కేంద్ర మంత్రి పదవి దక్కించుకుని రాష్ట్ర విభజన పాపంలో భాగమయ్యారని సోమిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు చిరు వైఖ‌రి చూస్తుంటే ఆయ‌న మ‌ళ్లీ మ‌రో పార్టీలోకి దూకేస్తాడేమోన‌ని అనిపిస్తోంద‌ని సోమిరెడ్డి సెటైర్ వేశారు.
Tags:    

Similar News