ఎవరికైనా విజయాల్లో రికార్డులు ఉంటాయి.. గెలుపులో సాధించిన రికార్డులను గొప్పగా చెప్పుకోవడం అలవాటుగా ఉంటుంది. అయితే ఏపీలో టిడిపికి చెందిన ఓ మాజీ మంత్రికి మాత్రం తెలుగు రాజకీయాల్లోనే ఎవరికీ లేని డిజాస్టర్ రికార్డు సొంతం అయ్యింది. ఏడు దశాబ్దాల తెలుగు రాజకీయాల్లో ఏ రాజకీయ నేతకు లేని రికార్డును ఆయన సొంతం చేసుకున్నారు. ఈ ఘనత వహించిన నేత ఎవరనుకుంటున్నారా ? ఆయన ఎవరో కాదు టిడిపికి చెందిన మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి.
ఎవరైనా గెలిచేందుకు పోటీ చేస్తుంటారు... అయితే సోమిరెడ్డి మాత్రం తాను పోటీ చేసేది ఓడిపోయేందుకే అన్నట్టుగా రికార్డు క్రియేట్ చేశారు. ఆయన పట్టులేని ఏ కమ్యూనిస్టు పార్టీకి చెందిన నేతో కాదు... ఏపీలో సుదీర్ఘ కాలం అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీకి చెందిన సీనియర్ నేత. తండ్రి నుంచి వచ్చిన రాజకీయ వారసత్వాన్ని అందిపుచ్చుకుని సోమిరెడ్డి 1994 - 1999 ఎన్నికల్లో సర్వేపల్లి నుంచి వరుసగా విజయం సాధించారు. చంద్రబాబు క్యాబినెట్లో మంత్రిగా కూడా పనిచేశారు.
2004 లో జరిగిన ఎన్నికల్లో ఓడిపోయినా సోమిరెడ్డి నాటి నుంచి తాజాగా జరిగిన ఎన్నికల వరకు మొత్తం ఐదు సార్లు టీడీపీ నుంచి అసెంబ్లీకి పోటీ చేసి ఓడిపోయారు. 2004 - 2009 ఎన్నికల తోపాటు 2012 కోవూరు ఉప ఎన్నికల్లో కూడా ఓడిన చంద్రబాబు మాత్రం సోమిరెడ్డికి 2014లో మరోసారి సీటు ఇచ్చారు. నవ్యాంధ్ర లో పార్టీ అధికారంలోకి వచ్చినా సోమిరెడ్డి మాత్రం వరుసగా నాలుగో సారి ఓడిపోయారు. అయినా చంద్రబాబు సోమిరెడ్డిని ఎమ్మెల్సీ చేసి కేబినెట్ లోకి తీసుకున్నారు.
మంత్రిగా ఉన్న సోమిరెడ్డి నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేసుకోవాల్సింది... పోయి గ్రూపు రాజకీయాలకు తెరతీశారు. దీంతో తాజాగా జరిగిన ఎన్నికల్లో వరుసగా ఐదో సారి కూడా ఆయన ఓటమి మూటగట్టుకున్నారు. ఏడు దశాబ్దాల తెలుగు రాజకీయ చరిత్రలో మంత్రిగా ఉంటూ... వరుసగా ఐదో సారి ఓడిపోయిన డిజాస్టర్ రికార్డును సోమిరెడ్డి సొంతం చేసుకున్నట్లు అయింది. టిడిపి అధికారంలో ఉన్న ఐదు సంవత్సరాలు నెల్లూరు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో గ్రూప్ రాజకీయాలు ప్రోత్సహించి టీడీపీని నాశనం చేశారన్న విమర్శలు సోమిరెడ్డి సొంత పార్టీ నేతల నుంచే మూటగట్టుకున్నారు.
మంత్రిగా జిల్లా అభివృద్ధి కాదు కదా కనీసం తన సొంత నియోజకవర్గమైన సర్వేపల్లిలో అభివృద్ధి పక్కన పెట్టేసి.... ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డిని టార్గెట్ చేయడమే సోమిరెడ్డి - ఆయన తనయుడు రాజగోపాల్ రెడ్డి పనిగా పెట్టుకున్నారు. దీంతో మరోసారి సోమిరెడ్డిని ప్రజలు తిరస్కరించారు. ఎన్నికలకు ముందు తనకు ఉన్న ఎమ్మెల్సీ పదవి కూడా సోమిరెడ్డి వదులుకొన్నారు. దీంతో ఇప్పుడు ఆయన రాజకీయ భవిష్యత్తు అంధకారంలో పడి పోయింది. వచ్చే ఎన్నికల్లో ఆయనకు సీటు వస్తుందన్న గ్యారంటీ కూడా లేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయన వారసుడిని అయినా రాజకీయాల్లో కంటిన్యూ చేస్తాడా ? లేదా ? అన్నది చూడాలి.