బీజేపీ సీనియర్ నేత - ఆ పార్టీ ఎమ్మెల్సీ సొము వీర్రాజు స్వరంలో ఏ మార్పు లేదు. ఆది నుంచి తమ మిత్రపక్షమైన టీడీపీ సర్కారుపై విమర్శలు గుప్పిస్తుండటంతో పాటుగా టీడీపీ అధినేత - ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు పైనా ఘాటు వ్యాఖ్యలు చేయడంలో ఏమాత్రం వెనుకంజ వేయని వీర్రాజు... నిన్న రాజమహేంద్రవరం వేదికగా బాబుపై ప్రశంసలు కురిపించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. మొత్తానికి బీజేపీ అధిష్ఠానం ఆదేశాలతోనే వీర్రాజు... బాబుపై తన వైఖరిని మార్చుకుని ఉంటారని అంతా భావించారు. అయితే బాబుపై ప్రశంసలు కురిపించి సరిగ్గా 24 గంటలు గడిచిందో - లేదో... వీర్రాజు మళ్లీ తన పాత వైఖరితోనే రంగంలోకి దిగిపోయారు. గతంలో మాదిరిగా చంద్రబాబు సర్కారుపై నిప్పులు చెరిగిన వీర్రాజు... కేంద్రంలోని బీజేపీ సర్కారు ఇస్తున్న నిధులతో ఏపీని అభివృద్ధి చేసుకుంటున్న చంద్రబాబు... ఆ అభివృద్ధి మొత్తం తానే చేస్తున్నానని కలరింగ్ ఇస్తున్నారని కూడా ఎద్దేవా చేశారు. అయినా సొమ్మొకడిదీ - సోకొకడిది అన్న చందంగా వ్యవహరిస్తున్న చంద్రబాబు.. దమ్ముంటే అభివృద్ధి నిధులపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
అంతేకాకుండా పొమ్మనలేక పొగ బెడుతున్నారంటూ నిన్న చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపైనా వీర్రాజు తనదైన శైలిలో పవర్ పంచ్ లు సంధించారు. అయినా చంద్రబాబు చెప్పినట్లుగా మిత్రధర్మాన్ని ఉల్లంఘిస్తోంది బీజేపీ కాదని చెప్పిన వీర్రాజు.. ఆ పని చూస్తున్నది చంద్రబాబేనని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా వీర్రాజు నోట మరో సంచలన వ్యాఖ్య కూడా వినిపించింది. చంద్రబాబు తమను మోసం చేశారని, ఆ మోసాన్ని తాము ఎన్నటికీ మరిచిపోలేమని కూడా ఆయన నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు తమను ఎక్కడ మోసం చేశారన్న విషయాన్ని కూడా ప్రస్తావించిన వీర్రాజు... కాకినాడ మునిసిపల్ ఎన్నికల్లో చంద్రబాబు తమను నమ్మించి నట్టేట ముంచారని ఆరోపించారు. తూర్పుగోదావరి జిల్లా జియ్యమ్మవలస మండలం పెదమేరంగిలో నేటి ఉదయం జరిగిన బీజేపీ బూత్ స్థాయి కార్యకర్తల సమావేశంలో మాట్లాడిన సందర్భంగా వీర్రాజు ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు.
టీడీపీ, ఆ పార్టీ అధినేత చంద్రబాబుపై వీర్రాజు ఏ స్థాయిలో విరుచుకుపడ్డారన్న విషయానికి వస్తే... *రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్న నిధులన్నీ కేంద్రానివే. రాష్ట్రంలో నిధుల సేకరణపై చంద్రబాబు శ్వేత పత్రం విడుదల చేయాలి. బీజేపీ చేసిన అభివృద్ధిని టీడీపీ ప్రభుత్వం చేసినట్లు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. నావి ఆరోపణలు కాదు... వాస్తవాలు. ముఖ్యమంత్రే మిత్ర ధర్మాన్ని ఉల్లంఘిస్తున్నారు. బీజేపీ ఓర్పుతో వ్యవహరిస్తోంది. టీడీపీతో విడిపోవాలని ఏనాడూ కోరుకోలేదు. విడిపోతామని వాళ్లు చెప్పినా... మేము విడిపోతామని చెప్పం. మిత్రపక్షమైన టీడీపీ అధికారంలో ఉన్నప్పటికీ.. బీజేపీ నేతలు ఒక్క పనీ చేయించుకోలేకపోతున్నారు. చంద్రబాబు అన్ని విషయాలపై అధ్యయనం చేసి... మాట్లాడాలి. కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ చేసిన మోసాన్ని మేం మర్చిపోం* అని సోము వీర్రాజు తనదైన శైలిలో చాలా స్పష్టంగానే కాకుండా చంద్రబాబును సూటిగానే టార్గెట్ చేశారు.