సోము వీర్రాజు.. బీజేపీ ఫైర్ బ్రాండ్.. బీజేపీ తో దోస్తీకి ప్రయత్నిస్తున్న చంద్రబాబు నిజస్వరూపం బయట పెట్టారు. మోడీ తో వ్యక్తిగత విభేదాలు లేవన్న చంద్రబాబు వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. దీక్షల్లో మోడీ మెడలు వంచుతానన్నది నిజం కాదా అని ప్రశ్నించారు. గల్లా జయదేవ్.. బాలకృష్ణ లాంటి నేతలతో మోడీ ని తిట్టించలేదా అని నిప్పులు చెరిగారు...
అమరావతి రాజధాని శంకుస్థాపనకు మోడీ పవిత్ర జలాలు తెస్తే కించపరిచేలా చంద్రబాబు మాట్లాడిన విషయం గుర్తులేదా అని సోము వీర్రాజు ద్వజమెత్తారు. బీజేపీ తో పొత్తు లో ఉండగానే ధర్మ దీక్షలు చేయడం.. మోడీ ని తిట్టడం.. బీజేపీ పై రెబల్స్ దింపి ఓడించాలనుకోవడం నిజం కాదా అని ప్రశ్నించారు.
ప్రభుత్వ సొమ్మును పప్పు బెల్లాల్ల పంచిపెట్టడం వల్ల బాబు కు ఓటమి ఎదురైందని సోము వీర్రాజు ఆరోపించారు. బీజేపీ ఎదుగుదల చూసి చంద్రబాబు లో భయం మొదలైందని.. అందుకే బీజేపీ తో దోస్తీకి చంద్రబాబు దారులు వెతుక్కుంటున్నారని మండిపడ్డారు.
ఇక ప్రభుత్వ భవనాలకు వైసీపీ కలర్ వేయడాన్ని సోము వీర్రాజు తప్పుపట్టారు.. జగన్ చంద్రబాబు బాటలో నడువవద్దని హితవు పలికారు..