‘ఏపీకి 900 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంటే చంద్రబాబు ఒక్క పోర్టుకట్టాడా? వైఎస్ రాజశేఖర్ రెడ్డి కట్టాడు.. నేను వైఎస్ ను పొగడడం లేదు..కానీ చంద్రబాబును మాత్రం వదలను.. ఈ విషయంలో బీజేపీ అధ్యక్షుడిని కాకపోయినా ఫర్వాలేదు’ ఏపీ బీజేపీ నేత, బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం మీడియాతో మాట్లాడిన వీర్రాజు చంద్రబాబుపై విరుచుకుపడ్డారు.
సోము వీర్రాజు మాట్లాడుతూ ‘చంద్రబాబుకు మైథాలజీ ఉందని.. తిమ్మిని బమ్మిని చేయడంలో సిద్ధహస్తుడని ఆరోపించారు. రాజధాని గురించి మాట్లాడే చంద్రబాబు హైదరాబాద్ అభివృద్ధి చేశానంటున్నాడని.. ఆ ఒక్క దాన్ని అభివృద్ధి చేయబట్టే ఇప్పుడు రాష్ట్ర విభజన ఇబ్బందులకు కారణమైందని ఆరోపించారు.
ఏపీలో అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని సోము వీర్రాజు స్పష్టం చేశారు. ఏపీని 25 జిల్లాలుగా విభజిస్తున్నారని.. రాజధానిని వదిలేసి అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు.
అభివృద్ధిపై జగన్ సర్కారు బ్లూ ప్రింట్ విడుదల చేయాలని సోము వీర్రాజు డిమాండ్ చేశారు. ఎన్నో ఆశలతో 151 సీట్లు ఇచ్చి గెలిపించిన జగన్ సర్కారు వారికి అభివృద్ధి చేసి న్యాయం చేయాలని సూచించారు.