ఏపీలో ఎటు తిప్పినా చర్చ సినిమా టికెట్ల దాకా పోతోంది. అసలే పండుగ సీజన్. సంక్రాంతి ముంగిట నిలిచి ఉంది. దాంతో సినిమా టికెట్ల కధ చాలా దూరమే వెళ్తోంది. సినీ దర్శకుడు రాం గోపాల్ వర్మ మంత్రి పేర్ని నానితో భేటీ వేసి మరీ తాను చెప్పాలనుకున్నది చెప్పేశారు. ఏపీలో టికెట్ల రేట్లు పెంచాల్సిందే అంటూ సినీ లోకం నుంచి ఒక వైపు విన్నపాలు వస్తున్నాయి. మరో వైపు చూసుకుంటే సినిమా టికెట్లు తగ్గించి సామాన్యుడిని వినోదాన్ని చేరువ చేశామని జగన్ సర్కార్ పెద్దలు చెప్పుకుంటున్నారు.
సరిగ్గా ఈ పాయింట్ దగ్గరే వారు దొరికేస్తున్నారు. పేదవాడిని ఇపుడు వినోదం ఫస్ట్ ప్రయారిటీ కానే కాదు, ఆ మాటకు వస్తే కూడూ గుడ్డా గూడు ఇంపార్టెంట్. వాటి విషయం తీసుకుంటే బయట ధరలు దారుణంగా ఉన్నాయి. ఇల్లు కట్టుకోవాలంటే ఇసుక సిమెంట్ ముఖ్యం. ఇపుడు ఆ రెండు నడి బజారులో దారుణంగా పెరిగిపోయి ఎకసెక్కం చేస్తున్నాయి. మరో వైపు చూస్తే ఆరుగాలం కష్టపడి పండించిన రైతులకు గిట్టుబాటు ధర లేకుండా పోతోంది. వారి ధాన్యానికి కనీస ధర ఇచ్చేవాడు లేదు.
ఇంకో వైపు అదే ధాన్యం బియ్యంగా మారితే కిలో యాభై నుంచి డెబ్బై రూపాయలుగా ఉంది. ఇక కూరగాయలు లాంటి నిత్యావసరాలు దారుణంగా పెరిగిపోయాయి. పప్పూ ఉప్పూ వంట నూనె ధరలు చూస్టే మంటగానే ఉంటోంది. దీంతో జనాలకు మేలు చేయాల్సినవి ఎన్నో ఉంటే సినిమా టికెట్ ధర దగ్గరే సర్కార్ ఆగిపోవడం అదే తమ గొప్ప అని చెప్పుకోవడం పైనా ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. దీని మీద ఏపీ బీజేపీ ప్రెసిడెంట్ సోము వీర్రాజు అయితే గట్టిగానే గర్జించారు.
ఏంటి మీరు తగ్గించిన సినిమా టికెట్లు. ఎందుకా గొప్పలు అంటూ బాగానే తగులుకున్నారు. మీరు దమ్ముంటే నిత్యావాసర ధరలు తగ్గించండి. జగన్ సొంత కంపెనీ నుంచి సిమెంట్ బస్తా ధరను తగ్గించి ఇవ్వండి అంటూ కామెంట్స్ చేశారు. ఏపీలో రెండు కోట్ల మంది నిత్యావసరాల ధరలు పెరిగి నానా కష్టం పడుతూంటే అది పాలకులకు పట్టదా అని ఆయన గుస్సా అయ్యారు. లేక ఇవన్నీ ప్రజలకు అసలు అవసరం లేవని భావిస్తున్నారా అని ప్రశ్నలను సంధించారు.
తమ చేతిలో ఉన్న వాటి ధరలను నియంత్రించడం మానేసి కేవలం వేల మంది చూసే సినిమా టికెట్లను తగ్గించామని చెప్పుకోవడమేంటి అని సోము గట్టిగానే గుచ్చేశారు. ప్రజల మీద నిజంగా ప్రేమ ఉంటే అన్ని రకాల ధరలు తగ్గించాలని ఆయన సవాల్ చేశారు. మొత్తానికి సినిమా చూపిద్దానుకున్న వైసీపీకి బీజేపీ నేత సరైన సినిమాయే చూపించేశారు అంటున్నారు.