బాబు బ‌స్సుల లెక్క చెప్పిన వీర్రాజు!

Update: 2019-05-14 05:11 GMT
ఐదేళ్ల బాబు పాల‌న‌కు సంబంధించిన సిత్రాలు ఒక్కొక్క‌టిగా బ‌య‌ట‌కు వ‌స్తున్నాయి. తాజాగా అలాంటి విష‌యాన్ని వెల్ల‌డించారు బీజేపీ జాతీయ కార్య‌వ‌ర్గ స‌భ్యుడు క‌మ్ ఎమ్మెల్సీ సోము వీర్రాజు. తాజాగా ఏపీ ఆర్టీసీ ఎండీకి లేఖ రాసిన ఆయ‌న.. ఆర్టీసీ అప్పులు.. ఆస్తులు.. న‌ష్టాలు.. లీజుల కేటాయింపుపై చ‌ర్చ‌లు జ‌ర‌పాల‌న్నారు. ఇందుకోసం రాజ‌కీయ పార్టీల‌తో స‌మావేశాన్ని నిర్వ‌హించాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు.

ఈ సంద‌ర్భంగా ఆస‌క్తిక‌ర‌విష‌యాన్ని చెప్పారు. ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు స‌భ‌ల కోసం ఏర్పాటు చేసిన బ‌స్సుల‌కు సంబంధించి దాదాపు రూ.225 కోట్ల బ‌కాయిల రూపంలో ప్ర‌భుత్వం చెల్లించాల్సి ఉంద‌ని చెప్పారు. ఆ మ‌ధ్య‌లో బాబుగారి డాబు ప్ర‌చారం కోసం అవ‌స‌రం లేకున్నా ధ‌ర్మ పోరాట దీక్ష పేరుతో స‌భ‌ల్ని నిర్వ‌హించ‌టం తెలిసిందే. వీటి కోసం భారీ ఎత్తున డ్వాక్రా మ‌హిళ‌ల్ని త‌ర‌లించే ప్రోగ్రాం పెట్టారు.

బాబు నిర్వ‌హించే దీక్ష స‌భ‌ల‌కు మ‌హిళ‌ల హాజ‌రును ప్ర‌త్యేకంగా ఫోక‌స్ చేసేందుకు వీలుగా ఆర్టీసీ బ‌స్సులు పెట్టి త‌ర‌లించే కార్య‌క్ర‌మాన్ని చేప‌ట్టేవారు. బ‌స్సుల్ని వాడుకోవ‌ట‌మే కానీ వాటికి చెల్లించాల్సిన మొత్తాల్ని చెల్లించ‌కుండా ఉంచేశారు. ఇప్పుడా బ‌కాయిలు ఏకంగా రూ.225 కోట్ల వ‌ర‌కూ ఉన్న‌ట్లుగా సోము ప్ర‌క‌టించారు.

ఇంత భారీ మొత్తంలో బ‌కాయిలు ఉన్న‌ప్పుడు వాటిని వ‌సూలు చేసే విష‌యంలో ఆర్టీసీ ఎందుకంత నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రిస్తుంద‌న్న వీర్రాజు మాట‌లోనూ ధ‌ర్మం ఉంద‌ని చెప్పాలి. ఓప‌క్క ఆర్టీసీ బీద అరుపులు అరిచే క‌న్నా.. త‌న‌కు రావాల్సిన బ‌కాయిల మీద ప్ర‌త్యేక ఫోక‌స్ పెడితే బాగుంటుంది క‌దా?

ఇమేజ్ బిల్డింగ్ కోసం కోట్లాది రూపాయిలు త‌గ‌ల‌బెట్టే బాబు ప‌రివారం.. ఆర్టీసీకి చెల్లించాల్సిన మొత్తాన్ని చెల్లిస్తే స‌రిపోతుంది క‌దా? బ‌కాయిల భారాన్ని పెంచేసి.. వాటిని స‌రి చేసేందుకు ఆర్టీసీ ఛార్జీలు పెంచేసే ప్ర‌భుత్వ తీరును వీర్రాజు త‌ప్పు ప‌ట్టారు. బాబు డాబు స‌భ‌ల కోసం ఆర్టీసీ బ‌స్సుల‌కు చెల్లించాల్సిన బ‌కాయిలు ఇప్పుడా సంస్థ మెడ మీద గుదిబండ‌గా మారుతుంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.
Tags:    

Similar News