అన్ని బయోపిక్‌లు ఒకేలా ఉండవు. తాజా ఉదంతం చూస్తే.. ఇదే విషయం అర్థమవుతుంది. భారత మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్. ఈ సినిమాలో కాంగ్రెస్ పార్టీని విపరీతంగా ద్వేషించే అనుపమ్ ఖేర్ మాజీ ప్రధాని మన్మోహన్ పాత్రను పోషిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ ఇటీవల విడుదలై.. అందరిలో ఆసక్తిని పెంచింది.
ఇదిలా ఉంటే.. ఈ చిత్రం విడుదలకు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్.. కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీల అనుమతి తప్పనిసరి అవుతుందని సెన్సార్ బోర్డు ఛైర్మన్ పహ్లజ్ నిహ్లానీ ఆదేశించారు. ఈ సినిమాలో సోనియా.. మన్మోహన్‌లతో పాటు పలువురు రాజకీయ నేతలు ఉంటారు కాబట్టి.. వారిద్దరి అనుమతి తప్పనిసరిగా చెబుతున్నారు. విజయ్ రత్నాకర్ డైరెక్షన్లో నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని హన్సల్ మెహతా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల ముందు ఈ సినిమాను విడుదల చేయాలని భావిస్తున్నారు.
తాజాగా ఈ చిత్రంపై సెన్సార్ బోర్డు తేల్చి చెప్పటమేకాదు.. సదరు ప్రముఖులిద్దరి నుంచి ఎన్ ఓసీలు తీసుకొస్తే తప్పించి సినిమా విడుదలకు ఓకే అనమని చెబుతున్నారు. మరి.. ఈ ఇద్దరు ప్రముఖులను సదరు నిర్మాత ఏం చెప్పి ఒప్పిస్తారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారిందని చెప్పక తప్పదు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/