సోనియా ఎంట్రీ.. కాంగ్రెస్ లో కీలక పరిణామం

Update: 2020-12-18 05:23 GMT
కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ దిగివస్తున్నారు. కాంగ్రెస్ లో నాయకత్వ మార్పు జరగాలని.. సంస్థాగత ఎన్నికలు నిర్వహించాలంటూ గత ఆగస్టులో గులాంనబీ ఆజాద్, కపిల్ సిబాల్ తోపాటు 23మంది నేతలు ఏకంగా పార్టీ అధినేత్రి సోనియాగాంధీకి లేఖ రాసిన సంగతి తెలిసిందే. అది కాంగ్రెస్ లో ఓ కుదుపు కుదిపింది.

ఈ క్రమంలోనే లేఖ రాసిన కాంగ్రెస్ అసమ్మతి వాదులతో సోనియాగాంధీ సమావేశానికి రెడీ అయినట్లు సమాచారం. మధ్యప్రదేశ్ మాజీ సీఎం కమల్ నాథ్ ఆధ్వర్యంలో సోనియాగాంధీతో ఈ అసమ్మతి నేతలంతా భేటి కానున్నట్లు సమాచారం. అసమ్మతి నేతలతో సయోధ్య కోసమే ఈ సమావేశం ఏర్పాటు చేసినట్లు సమాచారం.

కర్ణాటక, మధ్యప్రదేశ్ లో ఓటమి.. బీహార్ లో కాంగ్రెస్ ఘోర పరాజయం నేపథ్యంలో సోనియా గాంధీ నష్టనివారణ చర్యలు చేపట్టారు.పార్టీ అగ్రనేతలు చిదంబరం, కపిల్ సిబల్ కూడా బాహాటంగా పార్టీ ప్రక్షాళన చేయాలని సూచించడంతో  సోనియాగాంధీ ఈ శనివారం పార్టీ ప్రక్షాళనకు నడుం బిగించినట్టు సమాచారం.

అసమ్మతి నాయకులతో భేటిలో రాహుల్, ప్రియాంక గాంధీ కూడా పాల్గొంటారని తెలుస్తోంది. రెబల్స్ తో మీటింగ్ తర్వాత పార్టీ ప్రక్షాళన ఉంటుందని చర్చ జరుగుతోంది.

ఈ అసమ్మతి నాయకులతో భేటిని కమల్ నాథ్ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారని.. ఆయన సలహాతోనే సోనియా సమావేశం అవుతున్నారని తెలిసింది. కాంగ్రెస్ కొత్త అధ్యక్ష పదవికి ఎన్నికలు నిర్వహించాలనే యోచనలో సోనియా ఉన్నట్టు సమాచారం.
Tags:    

Similar News