కోపతాపాలు మామూలు. మనిసన్నోడికి కాకుండా మానులకు రావు కదా. అలాంటివి వచ్చినప్పుడు విచక్షణ కోల్పోకుండా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. కానీ.. ఆ విషయాన్ని మర్చిపోయన సమాజ్ వాదీ ఎంపీ ఒకరు చేసిన చేష్టను అందరూ తప్పు పడుతున్నారు. సభాధిపతిగా వ్యవహరించే స్పీకర్ పట్ల గౌరవ మర్యాదలతో వ్యవహరించటం తప్పనిసరి. ఇదంతా ఒక ఎత్తు అయితే.. సభాపతి స్థానంలో ఒక మహిళ ఉన్నప్పుడు మరింత జాగరూకతో వ్యవహరించాల్సిన అవసరం ఉంది. కానీ.. నోట్ల రద్దు అంశంపై హద్దులు దాటే అగ్రహాన్ని ప్రదర్శిస్తున్న సమాజ్ వాదీ పార్టీ ఎంపీ చేసిన పని చూసినప్పుడు.. పార్లమెంటు గౌరవ మర్యాదల పట్ల సభ్యులకు ఉన్న గౌరవం ఇంతేనా? అన్న భావన కలగటం ఖాయం.
నోట్ల రద్దు నిర్ణయంపై మోడీ సర్కారు తీరును తీవ్రంగా తప్పుపడుతున్న విపక్షాలు.. గడిచిన కొద్దిరోజులుగా ఆందోళనలు చేపట్టాయి. నినాదాలు.. ఆందోళనలు చేస్తున్న విపక్ష సభ్యులు గురువారం మరింతగా చెలరేగిపోయారు. ఈ రోజు లోక్ సభ ప్రారంభం అయిన వెంటనే.. స్పీకర్ సుమిత్రా మహాజన్ పోడియం వద్దకు చేరి నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా నినాదాలు చేస్తున్న సమయంలో సమాజ్ వాదీ ఎంపీకి అక్షయ్ యాదవ్ కాగితాలు చించి.. స్పీకర్ మీదకు విసిరారు. దీంతో.. సభలోగందరగోళం చోటు చేసుకుంది. స్పీకర్ పట్ల సదరు ఎంపీ చర్యను పలువురు తప్పు పడుతున్నారు. ఇలాంటి వైఖరిని ప్రదర్శించిన ఎంపీపై వేటు వేయాలన్న డిమాండ్ ను పలువురు ఎంపీలు చేస్తున్నారు. స్పీకర్ ఈ డిమాండ్ పై ఎలా రియాక్ట్ అవుతారన్నది ఇప్పుడు ఉత్కంటగా మారింది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/