తనను హత్య చేయటానికి ముగ్గురు ప్లాన్ చేస్తున్నారని.. అందుకు సంబంధించిన ఆడియో క్లిప్ తాను విన్నట్లుగా చెప్పిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాటలు సంచలనంగా మారాయి. పశ్చిమ గోదావరి జిల్లాలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడిన సందర్భంగా ఆయనీ సంచలన వ్యాఖ్యలు చేశారు.
తాను ఆ ముగ్గురిని గుర్తు పట్టగలనని.. తనను చంపేస్తే మహా అయితే ఒక నెల రోజులు గొడవలు జరుగుతాయేమోనని చేసిన వ్యాఖ్యల్ని తాను విన్నానని.. వారిని గుర్తు పట్టినట్లుగా ఆయన చెప్పారు. పవన్ వ్యాఖ్యలపై తాజాగా పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ రవి ప్రకాశ్ స్పందించారు. పవన్ ను హత్య చేయటానికి ప్లాన్ చేసిన వారి వివరాలు తమకు ఇవ్వాలని కోరారు.
2019 ఎన్నికల్లో తాను పోటీ చేయకుండా ఉండేందుకు వీలుగా తనను హత్య చేయటానికి ప్లాన్ చేస్తున్నట్లుగా పవన్ చేసిన వ్యాఖ్యలపై స్పందించిన ఎస్పీ.. మీ దగ్గర ఏమైనా వివరాలు ఉంటే తెలియజేయండి.. వారిపై చర్యలు తీసుకుంటాం.. తగు విచారణ జరుపుతామంటూ ఎస్పీ ఒక ప్రకటనలో వెల్లడించారు. అంతేకాదు.. పవన్ కుమరింత భద్రతను కల్పిస్తున్నట్లుగా వెల్లడించారు. మరి.. తన దగ్గర ఉన్న ఆధారాల్ని పవన్ బయటపెడతారా? జిల్లా ఎస్పీ కోరినట్లుగా ఆయనకు వివరాలు అందిస్తారా అన్నది చూడాలి.