తెలంగాణ సీనియర్ రాజకీయ నాయకుడు , ప్రస్తుత సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి ఎప్పుడూ లేని విధంగా స్టేజ్ పైనే తీవ్ర ఆవేదనకు గురై , కంటతడి పెట్టుకున్నారు. నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం హంగర్గా గ్రామంలో ఏర్పాటు చేసిన సభలో ఆయన పాల్గొన్న సందర్భంగా ఆయన స్టేజి పైనే భావోద్వేగానికి గురయ్యారు . నిజామాబాద్ జిల్లా బాన్సువాడ నియోజకవర్గ అభివృద్ధికి ఎనలేని కృషి చేస్తున్నాన్నారు. అలాంటి తనపై కొందరు వ్యక్తులు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసారు. రాజకీయాల్లో చాలా సీనియర్ నేతగా ఉన్న ఆయన ఇలా కన్నీరు పెట్టడం పలువురిని కలిచి వేసింది.
ఆ తరువాత ఆయన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గానికి 5 వేల ఇళ్లు మంజూరయ్యాయని, నష్టాలు వస్తాయని భావించి డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు నిర్మించడానికి కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదన్నారు. దీంతో కాంట్రాక్టర్ ల చుట్టు తిరిగి పనులు చేయించాల్సి వస్తోందన్నారు. అయినా కొంతమంది వ్యక్తులు అభివృద్ధిని చూసి ఓర్వలేక ఆరోపణలు చేస్తున్నారని ఆయన ఆవేదనకు గురయ్యారు. ఈ పథకం కోసం లాటరీ పద్దతి విధానాన్ని అమలు చేస్తున్నామన్నారు. లబ్దిదారులందరికీ న్యాయం జరుగుతుందని సంయమనం పాటించాలని అన్నారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం ఎవరైనా డబ్బులు తీసుకుంటే అరెస్ట్ చేసి జైలుకు పంపుతామని హెచ్చరించారు.