స్పీకర్ అన్న పదవి రాజ్యంగ బద్ధమైనది. ఆ పదవిలో ఎవరు ఉన్నా న్యూట్రల్ గానే ఉండాలి. అంతకు ముందు ఏ పార్టీ తరఫున గెలిచినా కూడా ఆ అగ్రాసనం చేపట్టగానే రాజకీయాలను తగ్గించుకోవాలి. పూర్తి స్థాయిలో అయితే వీలు కాదు అని అనుకుంటే చాలా మటుకు తనకు తానుగా కట్టడి చేసుకోవాలి. కానీ చిత్రమేంటి అంటే స్పీకర్లు ఎక్కువగా రాజకీయాలు మాట్లాడడం.
ఇది ఈ రోజు కొత్త కాదు గతంలోనూ జరిగింది. ఇపుడూ జరుగుతోంది. నాడు తప్పు అన్న వారే ఇపుడు తమ ప్రభుత్వంలో అదే తప్పు చేయడం విశేషం. విషయానికి వస్తే శాసన సభ స్పీకర్ తమ్మినేని సీతారాం చాలా కాలంగా రాజకీయాలు మాట్లాడుతున్నారు. ఆయన మంత్రులు, ఎమ్మెల్యేల కంటే కూడా ఎక్కువ మాట్లాడుతూ వస్తున్నారు.
లేటెస్ట్ గా ఆయన మహానాడుని పట్టుకుని వల్లకాడు అనేశారు. నిజానికి అది చాలా పెద్ద మాట. ఒక పార్టీ తన రాజకీయ కార్యకలాపాల కోసం పార్టీ ఆవిర్భావ దినోత్సవం నిర్వహించుకుంటుంది. ఆ హక్కు ఆ పార్టీకి ఉంది. దానికి వారు పెట్టుకున్న పేరు మీదనే కామెంట్స్ చేయడం ఎంతవరకూ సబబు అన్న ప్రశ్న వస్తోంది.
మరో వైపు చూస్తే తమ్మినేని సీతారాం రాజకీయం పుట్టిందే టీడీపీలో. ఆయన అక్కడే పలుమార్లు ఎమ్మెల్యే అయ్యారు, మంత్రి పదవులు చేపట్టారు. ఆయన ఎన్నో మహానాడులను చూశారు. మరి నాడు అవి బాగున్నాయా లేక నేడు మాత్రమే వల్లకాడుగా కనిపిస్తున్నాయా అనంటే ఏం జవాబు చెబుతారు. విమర్శలు చేయడానికి హద్దులు ఉంటాయి కదా అన్న విమర్శలు కూడా వస్తున్నాయి.
అలాంటిది స్పీకర్ రాజకీయ విమర్శలు చేయడం ఏంటి అని కూడా అంటున్నారు. దీనిమీద తమ్మినేని కి ఆముదాలవలసలో ప్రత్యర్ధి, మాజీ ఎమ్మెల్యే టీడీపీ నేత కూన రవికుమార్ సరైన కౌంటరే ఇచ్చారు. మహానాడుని వల్లకాడు అని మాట్లాడి తల్లి పాలు తాగి రొమ్ము గుద్దిన చందంగా తమ్మినేని వ్యవహరించారు అని దుయ్యబెట్టారు. 2024లో జనాలు ఎవరికి ఎలాంటి ఫలితాలు ఇస్తారో వేచి చూడండి అని కూడా హాట్ కామెంట్స్ చేశారు
ఇక తమ్మినేని రాజకీయ ప్రసంగాల పట్ల బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు అయితే తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఉన్నతమైన రాజ్యాంగ పదవిలో ఉంటూ రాజకీయ విమర్శలు చేయడమేంటని ప్రశ్నించారు. స్పీకర్ అన్న వారు ఈ స్థాయిలో రాజకీయాల మీద మాట్లాడుతారా అని కూడా ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
మొత్తానికి తమ్మినేని దూకుడు చేస్తున్నారు అన్న భావన అంతటా ఉంది. అయితే ఆయన రాజకీయాలు మాట్లాడాలి అనుకుంటే స్పీకర్ పదవికి రాజీనామా చేస్తే తన ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడవచ్చు అని సలహాలు ఇస్తున్నారు. మొత్తానికి స్పీకర్ పదవి అంటే రాజకీయాల గురించి ఎక్కువగా మాట్లాడం అనే అర్ధం వచ్చేలా వ్యవహరించడమే బాధాకరం అని అంటున్నారు.